India VS Australia : చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా.. ఆరుసార్లు ఐసీసీ వరల్డ్ కప్ ఆసీస్‌దే.. దారుణంగా ఓడిపోయిన భారత్
ప్రధానాంశాలు:
వరల్డ్ కప్ ఫైనల్స్ లో దారుణంగా ఓడిపోయిన టీమిండియా
10 మ్యాచ్ లలో గెలిచి చివరకు ఫైనల్స్ లో ఓడిపోయిన భారత్
ఓవర్ కాన్ఫిడెన్సే టీమిండియాను ఓడించిందా?
India VS Australia : ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. వరల్డ్ కప్ చాంపియన్స్ గా అవతరించింది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ని సాధించారు. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలిచి సత్తా చాటింది. నిజానికి ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచి ఈసారి వరల్డ్ కప్ సాధించాలన్న కసిలో ఉండేది భారత్. అందుకే లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలవడమే కాదు.. సెమీ ఫైనల్స్ లోనూ గెలిచిన భారత్.. చివరకు ఫైనల్స్ లో ఓడిపోయి ఆస్ట్రేలియాకు ట్రోఫీని అందించింది.
ఈ గెలుపుతో ఆస్ట్రేలియా ఆరుసార్లు వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. 43 ఓవర్లకే మ్యాచ్ ను పూర్తి చేసింది ఆస్ట్రేలియా.ఆస్ట్రేలియా గెలుపునకు ట్రావిస్ హెడ్ చాలా కష్టపడ్డాడు. ఒకరకంగా చెప్పాలంటే ట్రావిస్ హెడ్ వల్లనే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ ను సునాయసంగా గెలిచిందని చెప్పుకోవాలి. 120 బంతుల్లో 137 పరుగులు చేసి ట్రావిస్ వరల్డ్ కప్ లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
15 ఫోర్లు, 4 సిక్సులు చేశాడు ట్రావిస్. ఇక.. మార్నస్ కూడా రెచ్చిపోయాడు. హాఫ్ సెంచరీ చేశాడు. 110 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం 3 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. టీమిండియా బౌలర్స్ లో బుమ్రా 2 వికెట్లు, షమీ ఒక వికెట్, సిరాజ్ ఒక వికెట్ తీశారు.