Ind Vs Pak : భారత్‌తో మ్యాచ్‌కి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్.. ఓదార్చిన తోటి సభ్యులు..!
ప్రధానాంశాలు:
Ind Vs Pak : భారత్‌తో మ్యాచ్‌కి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్.. ఓదార్చిన తోటి సభ్యులు..!
Ind Vs Pak : భారత్ India వర్సెస్ Pakistan పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రేపు( ఆదివారం, ఫిబ్రవరి 23) జరగనున్న విషయం తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.ఇప్పటికే టీమిండియా, బంగ్లాదేశ్‌పై గెలిచి వస్తుంటే, పాకిస్థాన్ Pakistan మాత్రం న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలై వస్తోంది.

Ind Vs Pak : భారత్‌తో మ్యాచ్‌కి ముందు వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ స్టార్ బ్యాట్స్‌మెన్.. ఓదార్చిన తోటి సభ్యులు..!
Ind Vs Pak అంత బాధ ఎందుకు..
అయితే భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవీడియోలో అతడు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడుస్తూ కనిపించాడు. కివీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేసే క్రమంలో స్టార్ ఓపెనర్ ఫఖర్ జమాన్ Fakar Zaman గాయపడ్డాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా రావాల్సిన అతడు నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఓ వైపు నొప్పి వేదిస్తున్నా 41 బంతుల్లో 24 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
ఔటైన తరువాత అతడు డ్రెస్సింగ్ రూమ్ Dressing Roomకు వెళ్లే క్రమంలో మెట్లు ఎక్కుతూ కూడా కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన తరువాత ఫఖర్ కుర్చీలో కూర్చొని ఏడ్చేశాడు. పక్కనే ఉన్న షాహీన్ అఫ్రిది, అసిస్టెంట్ కోచ్‌లు పఖర్‌ను ఓదార్చేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి అతను ఏడవడానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది