Virat Kohli : దేశం మీద కోహ్లీకి గౌరవం తగ్గిందా.. ఆయన అనుచిత ప్రవర్తనపై అభిమానుల ఆగ్రహం..
Virat Kohli : టీమిండియా క్రికెట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా, భారత యూత్‌కు రోల్ మోడల్‌గా భావించే విరాట్ కోహ్లీ ప్రవర్తనపై ప్రస్తుతం ఆయన అభిమానులు మండిపడుతున్నారు. కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తిస్తాడని అనుకోలేదని, దేశం పట్ల ఆయనకున్న గౌరవం ఇదేనా? అని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ కోహ్లీ ఏం చేశాడంటే…విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఆయనకు ఫాలోవర్స్ తో పాటు హేటర్స్ కూడా ఉన్నారు.
అందుకు కారణం ఆయన యాటిట్యూడ్. సాధారణ సమయాల్లో వెరీ ఫన్నీగా, హ్యాపీగా కనిపించే విరాట్.. మ్యాచ్ టైంలో మాత్రం చాలా సీరియస్‌గా, అగ్రెసివ్‌గా ఉంటారు. ఆన్ ది ఫీల్డ్ వచ్చాడంటే చాలు.. ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే అరిచేసేంత పని చేస్తుంటాడు. అయితే, కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాత విరాట్ కోహ్లీలో మార్పులు వచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.మూడో వన్డేకు ముందు విరాట్ కోహ్లీ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. మ్యాచ్ స్టార్ట్ అవడానికి మందు జాతీయ గీతాన్ని ఆలిపిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ కళ్లలో దేశ భక్తి, దేశం మీద ఉన్న గౌరవం కనిపిస్తుంటుంది.

fans slams virat kohli behaviour during national anthem
Virat Kohli : కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన తర్వాతనే ఆ మార్పులు..
కానీ, తాజాగా దక్షిణ ఆఫ్రికాతో మూడో వన్డే స్టార్ట్ అవడానికి ముందు భారత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ బబుల్ గమ్ నములుతూ నిలబడుతున్నాడు. అది చూసి సగటు క్రికెట్ అభిమాని ఆశ్చర్యానికి గురి అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసి కోహ్లీ ఇలా చేశాడు ఏంటని ప్రశ్నిస్తున్నారు. దేశం మీద కోహ్లీకి ఉన్న గౌరవం ఇదేనా అని అడుగుతున్నారు. కోహ్లీ ఇలా అనుచితంగా ప్రవర్తించడానికి గల కారణాలేంటని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. కోహ్లీకి దేశం పట్ల గౌరవంతో పాటు బాధ్యత తగ్గిందనే ఇలా చేస్తున్నాడని కొందరు అంటున్నారు.