Father and Son Champions : తండ్రీ తనయులిద్దరూ ప్రపంచ విజేతలే.. అప్పట్లో ఫాదర్.. ఇప్పుడు సన్..
Father and Son Champions : మేల్ టీ 20 వరల్డ్ కప్ స్టార్ట్ అయిన పధ్నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా టీమ్ చాంపియన్‌గా నిలిచింది. వన్డే వరల్డ్ కప్‌ను ఐదు సార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా కంట్రీ చాలా కాలం తర్వాత టీ 20 వరల్డ్ కప్ అనగా పొట్టి ప్రపంచ కప్ దక్కించుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచి ప్రపంచ చాంపియన్ అయింది.ఇకపోతే ఆస్ట్రేలియా జట్టును విజయ తీరాలకు చేర్చడొంలో మిచెల్ మార్ష్ కీలక పాత్ర పోషించాడు. అయితే, ఇంకో కీలక విషయమేమిటంటే.
. మిచెల్ మార్ష్ మాదరిగానే ఆయన తండ్రి కూడా ఆస్ట్రేలియాను విశ్వవిజేత చేయడానికి చాలా కృషి చేశాడు. 34 ఏళ్ల కిందట అనంగా 1987లో జరిగిన ప్రపంచ వరల్డ్ కప్‌లో 428 పరుగులు చేసి సత్తా చాటాడు మిచెల్ ఫాదర్ జెఫ్ మార్ష్.అలా ఆస్ట్రేలియా తొలి సారి వన్డే వరల్డ్ కప్ గెలవడంతో కీలకపాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాను గెలిపించడంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అది కూడా తండ్రీ తనయులు కీలక పాత్ర పోషించడం గురించి తెలుసుకుని చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Father and Son Champions : ఆస్ట్రేలియా విశ్వ విజేత కావడంలో మార్ష్ కీలక పాత్ర..
తాము పుట్టిన దేశం కోసం అంతలా సేవలందించిన ఆ తండ్రీ తనయులిద్దరూ ధన్యులేనని అంటున్నారు. జెఫ్ మార్ష్ ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గానూ ఉన్నాడు. మొత్తంగా ఫాదర్ అండ్ సన్ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియా కంట్రీకి మొత్తంగా మూడు సార్లు ప్రపంచ కప్ అందించారు. మిచ్ మార్ష్ ఆసీస్‌కు అందని ద్రాక్షగా ఉన్న పొట్టి ప్రపంచ కప్ అనగా టీ 20 వరల్డ్ కప్ సాధించి పెట్టి ఆస్ట్రేలియా దేశ పౌరులందరూ గర్వపడేలా చేశాడు.
ఈ ఇంటి నుంచి ఇంకొ క్రికెటర్ కూడా ఉన్నాడు. అతనెవరంటే.. మిచ్ మార్ష్ బ్రదర్ షాన్ మార్ష్. ఈయన కూడా ఆస్ట్రేలియా తరఫున మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో రాణించిన మిచ్ మార్ష్..జెఫ్ మార్ష్ బ్రదర్ అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఇకపోతే ఒకే ఇంటి నుంచి ఇలా ముగ్గురు క్రికెటర్స్ ఉండటం చూసి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ దేశానికి విజయాలు అందించి వారు రుణం తీర్చుకుంటున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.