Ravi Shastri : మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన కామెంట్స్.. రంజీ ట్రోఫీని మరిస్తే భారత్ పని అయిపోయినట్టే..?
Ravi Shastri : దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ‘రంజీ ట్రోఫీ’భారత క్రికెట్‌కు బ్యాక్ బోన్ లాంటిదని, దానిని మరిస్తే భారత్ నడ్డి విరిగినట్టే అని టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన బీసీసీఐని హెచ్చరించాడు. రంజీ ట్రోఫీని విస్మరిస్తే ఆ క్షణం నుంచి భారత క్రికెట్ వెన్నుముక లేకుండా తయారవుతుందని రవిశాస్త్రి సంచలన ట్వీట్ చేశాడు. కరోనా విజృంభణ కారణంగా ఈనెల 13న ప్రారంభంకావాల్సిన రంజీ ట్రోఫీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వాయిదా వేసింది.రవిశాస్త్రి ట్వీట్ చేసిన కొంత టైం తర్వాత బీసీసీఐ సెక్రటరీ జైషా రంజీ ట్రోఫీ నిర్వహణపై కీలక ప్రకటన చేశారు.
రంజీ ట్రోఫీని ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించాడు. ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించినదని.. ఫిబ్రవరిలో మొదటి దశలో లీగ్ మ్యాచ్‌లను పూర్తిచేయనున్నట్టు తెలిపారు. మార్చి 27 నుంచి ఐపీఎల్ ఉన్నందున.. జూన్‌లో నాకౌట్ టోర్నీ జరుగుతుందని స్పష్టం చేశారు.రంజీ ట్రోఫీ ద్వారా ప్రతీ ఏడాది భారత క్రికెట్‌కు ఎంతోమంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వస్తున్నారు. ఈ టోర్నీ ఉద్దేశాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జైషా చెప్పారు.

former coach ravi shastris comments about ranji trophy conduct
Ravi Shastri : రవిశాస్త్రీ ట్వీట్ దుమారం
38 జట్లు బరిలో దిగే రంజీ ట్రోఫీ ఫిబ్రవరి రెండో వారంలో మొదలయ్యే అవకాశముంది. నెల రోజుల్లో లీగ్ దశ పూర్తవుతుంది. ఐపీఎల్ అనంతరం రెండో దశ రంజీ ట్రోఫీ నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తోంది. టీమిండియా హెడ్ కోచ్ పదవికాలం ముగిసినప్పటి నుంచి రవిశాస్త్రి భారత క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతున్నారు. రంజీట్రోఫీ నిర్వహణ విషయంపై బీసీసీఐ సభ్యులకు చురకలు అంటించి రవి శాస్త్రి, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో కూడా బోర్డు పెద్దలను ఉద్దేశించి వివాదాస్పద కామెంట్స్ చేశారు.