IPL 2022 : వికెట్లను తన బ్యాట్ తో కొట్టిన బ్యాటర్.. ఎందుకో తెలుసా?
IPL 2022 : ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్‌లు చాలా రంజుగా సాగుతున్నాయి. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ను దురదృష్టం వెంటాడింది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అనూహ్యంగా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్‌లో కీరన్ పొలార్డ్ వేసిన అఖరి బంతిని పుల్ షాట్ ఆడటానికి సుదర్శన్ ప్రయత్నించాడు. బ్యాలన్స్ కోల్పోయి తన బ్యాట్‌తో వికెట్లను కొట్టాడు. దీంతో ఈ సీజన్‌లో హిట్ వికెట్‌గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా సాయి సుదర్శన్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఒక్క విజయం సాధించగలిగితే ప్లేఆఫ్స్‌లోకి దర్జాగా అడుగు పెట్టే దశలో గుజరాత్ టైటాన్స్ బొక్క బోర్లా పడుతోంది.
వరసగా రెండు మ్యాచ్‌లల్లో బోల్తా కొట్టింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే- ప్లేఆఫ్స్‌లోకి చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించగలుగుతుందీ టీమ్. ఆ ఒక్క విజయాన్ని అందుకోవడానికి నానాతంటాలు పడుతోంది. శుక్రవారం రాత్రి ముంబై సీసీఐ-బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో దారుణంగా ఓడింది గుజరాత్ టైటాన్స్. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులు చేయాల్సిన దశలో చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది.రోహిత్ శర్మ-43, ఇషాన్ కిషన్-45, టిమ్ డేవిడ్- 44 పరుగులతో రాణించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసింది.
IPL 2022 : నిరాశగా వెనుదిరిగాడు..
వృద్దిమాన్ సాహా-55, శుభ్‌మన్ గిల్-52 హాఫ్ సెంచరీలతో 106 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది గుజరాత్. మురుగున్ అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో గుజరాత్ పతనం ఆరంభమైంది. తొలి బంతికి శుభ్‌మన్ గిల్, చివరి బంతికి వృద్ధిమాన్ సాహా అవుట్ అయిన తరువాత ఇక కోలుకోలేకపోయింది. అప్పటికి జట్టు స్కోరు 111. వికెట్లు చేతిలో ఉన్నా, హిట్టర్లు క్రీజ్‌లో ఉన్నా గానీ విజయాన్ని అందుకోలేకపోయింది.డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్ క్రీజ్‌లో ఉండి కూడా గెలిపించలేకపోయాడంటే దరిద్రం ఏ రేంజ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను వెంటాడుతోందో అర్థం చేసుకోవచ్చు. చివరి ఓవర్‌లో తొమ్మిది పరుగులను కూడా సాధించలేక ఓడిపోవాల్సి రావడం.. ఐపీఎల్ వంటి ఫార్మట్‌లో చాలా చాలా అరుదు