IPL 2022 : ఐపీఎల్ మ్యాచ్‌లో పవర్ కట్.. డీఆర్ఎస్ లేక చెన్నై బ్యాట్స్‌మెన్స్ విలవిల
IPL 2022 : ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. గురువారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ డెవాన్ కాన్వే ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో డానియల్ సామ్స్ వేసిన రెండో బంతి.. స్ట్రైక్‌లో ఉన్న డెవాన్ కాన్వే ప్యాడ్‌ను తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకు అప్పీలు చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. అయితే వారికి రెండు డీఆర్ఎస్ ఆప్షన్స్ ఉన్నా కూడా తీసుకొని లేని పరిస్థితి. అందుకు కారణం పవర్ కట్. ఈ ఇష్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముంబైలోని వాంఖెడె స్టేడియంలో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో రెండు కీలక మార్పులతో బరిలోకి దిగింది రోహిత్ సేన.పొలార్డ్ స్థానంలో ట్రిస్టన్ స్టబ్స్ ను జట్టులోకి తీసుకుంది. అలాగే, మురుగన్ అశ్విన్ స్థానంలో హృతిక్ సోకిన్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగింది. అయితే స్టేడియంలో పవర్ కట్ వల్ల డీఆర్ఎస్ కోరుకునేందుకు కాన్వేకు అవకాశం దక్కలేదు. దీంతో.. అతడు నిరాశగానే వెనుదిరిగాడు. అటు ఊతప్ప సైతం ఎల్బీ కాగా.. డీఆర్ఎస్ కు ఛాన్స్ దక్కలేదు. అయితే, ఊతప్ప క్లియర్ గా ఔట్ గా కన్పించింది. పవర్ కట్ వల్ల టాస్ కూడా ఆలస్యమైంది.
IPL 2022 : పాపం చెన్నై..
రెండు గంటల తర్వాత కరెంట్ రావడంతో డీఆర్ఎస్ అందుబాటులోకి వచ్చింది. ముంబైతో మ్యాచ్ గెలిస్తే చెన్నైకి ప్లే ఆఫ్‌కి వెళ్లే ఛాన్స్ అయిన ఉండి ఉండేది. కాని పవర్ కట్ వలన చెన్నై నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్ల దెబ్బకు చెన్నై బ్యాటింగ్ ఆర్డర్ కకావికలమైంది. బ్యాటర్లు క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. వాంఖడే స్టేడియంలో గత రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ముంబై వెళ్తూవెళ్తూ చెన్నైని కూడా ఇంటికి తీసుకెళ్లింది. ఆ జట్టుకు ఏ మూలో మిణుకుమిణుకుమంటున్న ప్లే ఆఫ్స్ అవకాశాలను చిదిమేసింది.