IPL Cheerleaders : ఐపీఎల్ చీర్ లీడర్స్ సంపాదన ఎంతో తెలుసా.. ఆ టీమ్ వారికి ఎక్కువ..!
ప్రధానాంశాలు:
IPL Cheerleaders : ఐపీఎల్ చీర్ లీడర్స్ సంపాదన ఎంతో తెలుసా.. ఆ టీమ్ వారికి ఎక్కువ..!
IPL Cheerleaders : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. 18వ సీజన్‌లో ప్రతి జట్టు కసిగా ఆడుతుంది. ఇంక అభిమానులు కూడా తమ ఫేవరేట్ జట్లని ఎంకరేజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మనకు ప్రతి ఐపీఎల్‌లో కూడా చీర్ లీడర్స్ కనిపిస్తుంటారు. చీర్ గర్ల్స్ ఐపీఎల్‌లో ఒక భాగం అయిపోయారు. వారు ప్రేక్షకులనే కాదు ప్లేయర్లను కూడా ఉత్సాహపరుస్తారు. ఐపీఎల్‌లో చీర్‌లీడర్లు కేవలం డాన్సర్స్ మాత్రమే కాదు, మ్యాచ్ ఇన్స్పిరేషన్ కి ప్రతిరూపాలు అని కూడా చెప్పొచ్చు.
IPL Cheerleaders : ఐపీఎల్ చీర్ లీడర్స్ సంపాదన ఎంతో తెలుసా.. ఆ టీమ్ వారికి ఎక్కువ..!
IPL Cheerleaders వారి జీతాలు ఎలా అంటే..
ప్రతి మ్యాచ్‌లో ప్లేయర్స్ సిక్స్, ఫోర్ లేదా వికెట్ తీసినపుడు చీర్లీడర్లు వేసే స్టెప్పులకు ఎంత ఇస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. చీర్‌లీడర్లందరికీ అలవెన్సులు ఇంకా మంచి మొత్తంలో జీతం లభిస్తుంది. ఊహించినంత అంతగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు అందుకునే జీతం చాల బెస్ట్ జీతం అని చెప్పొచ్చు. ఒక చీర్లీడర్ గర్ల్ సాధారణంగా మ్యాచ్‌కు రూ. 15,000 నుండి రూ. 17,000 వరకు సంపాదిస్తారు. దీనితో పాటు ఫ్రాంచైజీ వారికి హోటల్ వసతి, ఫుడ్ ఇంకా ప్రయాణ ఖర్చులను కూడా భరిస్తుంది.
షారుఖ్ ఖాన్ టీం కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ చీర్‌లీడర్లకు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు సమాచారం. KKR చీర్లీడర్లలో ఒక్క మ్యాచ్‌కు ఒక్కరికి రూ.24,000 నుండి రూ.25,000 వరకు చెల్లిస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ ముంబై ఇండియన్స్ జట్లు చీర్లీడర్లకు మ్యాచ్ కు దాదాపు రూ.20,000 చెల్లిస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కూడా చీర్లీడర్లలో ఒక్కొక్కరికి మ్యాచ్‌కు రూ. 17,000 చెల్లిస్తుంది. కానీ పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు చీర్‌లీడర్లకు మ్యాచ్‌కు రూ.12,000 చెల్లిస్తున్నట్లు సమాచారం. అదనంగా జట్టు గెలిస్తే బోనస్ ఇస్తారు.