ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరేట్ ఎవరు… భారత్ బలమెంత ?
ప్రధానాంశాలు:
ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరేట్ ఎవరు... భారత్ బలమెంత ?
ICC Champions Trophy : రోహిత్ శర్మ rohit sharma నేతృత్వంలో టీమ్ ఇండియా Team India ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు ICC Champions Trophy రెడీ అయింది. వన్డే ర్యాంకింగ్‌లో 119 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా నెంబర్ 1 జట్టుగా టోర్నీ బరిలో దిగుతుంది. చాంపియన్స్ ట్రోఫీ Champions Trophy టైటిల్ సాధించేందుకు టీమ్ India ఇండియాకు ఉన్న సాధ్యాసాధ్యాలు, బలాబలాలు ఏమిటనే దానిపై చర్చ నడుస్తుంది.

ICC Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీలో టైటిల్ ఫేవరేట్ ఎవరు… భారత్ బలమెంత ?
ICC Champions Trophy ఎవరి బలాలేంటి..
రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో పాక్ న్యూజిలాండ్ పై ఓడింది. ప్రస్తుతం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ సొంతగడ్డపై జరుగుతుండటం పాకిస్థాన్ కు పెద్ద సానుకూలత. రీసెంట్ గా జరిగిన ట్రై సిరీస్ లో పాకిస్థాన్ ను ఓడించి జోష్ లో ఉంది. సౌతాఫ్రికా విషయానికి వస్తే.. బ్యాటింగ్‌లో క్లాసెన్, వాండర్‌డసెన్, మార్‌క్రమ్, మిల్లర్ జట్టుకు అండగా ఉన్నారు. పేస్‌లో రబాడ, స్పిన్నర్లు కేశవ్ మహరాజ్, షంసి రాణిస్తారని అంచనా. ఎంగిడి ఫామ్‌లో కనిపించడం లేదు.
ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ లో డకెట్, సాల్ట్, బ్రూక్, బట్లర్, లివింగ్‌స్టన్, రూట్ బలంగానే ఉన్నారు. స్పిన్నర్ రషీద్ ఒక్కడే పర్వాలేదు. మిగతా స్పిన్నర్లు డౌటే. పేస్ విభాగంలోనూ ఆర్చర్, వుడ్, మహమూద్, సకిబ్ ఫామ్‌లో కనిపించడం లేదు. ఆసీస్ జట్టులోని స్టార్ ఆటగాళ్లంతా గాయాలతో దూరమయ్యారు. బంగ్లా, ఆఫ్ఘనిస్తాన్ ఓ మోస్తరు ఫైట్ ఇస్తాయని తెలుస్తుంది. ఇక భారత్ విషయానికి వస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఈ మధ్యనే ఫామ్‌లో రావడం , హార్దిక్ పాండ్యా అప్పుడప్పుడూ మెరుపులు మెరిపించడం అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, మొహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్‌లతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండడం టీమిండియాకి బలంగా చెప్పవచ్చు