Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్ర: 8 ఎడిషన్లు.. ఇందులో 7 ఛాంపియన్లు ఎవరెవరంటే..!
ప్రధానాంశాలు:
Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్ర: 8 ఎడిషన్లు.. ఇందులో 7 ఛాంపియన్లు ఎవరెవరంటే..!
Champions Trophy : ఎనిమిదేళ్ల తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ పాకిస్థాన్, యూఏఈ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. మొత్తం 8 టీమ్స్ మధ్య 15 మ్యాచ్‌లు జరుగుతాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చివరి ఎడిషన్ 2017లో జరిగింది.

Champions Trophy : ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్ర: 8 ఎడిషన్లు.. ఇందులో 7 ఛాంపియన్లు ఎవరెవరంటే..!
Champions Trophy వీరే విజేతలు..
కరోనా కారణంగా 2021లో జరగాల్సిన టోర్నమెంట్‌ను రద్దు చేశారు. అయితే భారతదేశం రెండుసార్లు టోర్నమెంట్‌ను గెలుచుకుంది, 2017 ఫైనల్‌ను పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది . కాగా, దక్షిణాఫ్రికా కు మొదటి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఫైనల్‌లో భారత్‌ను ఓడించడం ద్వారా న్యూజిలాండ్ తమ మొట్టమొదటి ఐసిసి ట్రోఫీని కైవసం చేసుకుంది.
2002లో రౌండ్ రాబిన్ పద్దతిలో ఇండియా- శ్రీలంకకి ట్రోఫీ దక్కింది. 2004లో వెస్టిండీస్ విజేతగా నిలిచింది. 2006 ఫైనల్‌లో ఆస్ట్రేలియా వెస్టిండీస్‌ను ఓడించింది. 2009లో ఆస్ట్రేలియా తమ రెండవ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఇక 2013లో భారతదేశం ఇంగ్లాండ్‌ను ఓడించి 2013 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడానికి పాకిస్తాన్ భారత్‌ను ఓడించింది.