ICC World Cup 2023 Final Match : ఆ టీమ్‌తోనే ఫైనల్ ఆడనున్న భారత్.. ఈసారి కప్పు మనదే.. 2023లో చరిత్ర సృష్టించబోతున్న టీమిండియా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ICC World Cup 2023 Final Match : ఆ టీమ్‌తోనే ఫైనల్ ఆడనున్న భారత్.. ఈసారి కప్పు మనదే.. 2023లో చరిత్ర సృష్టించబోతున్న టీమిండియా

ICC World Cup 2023 Final Match : టీమిండియా ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 లోనూ టీమిండియా దూసుకుపోతుంది. అజేయంగా ముందుకుసాగుతోంది. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు. చివరకు ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సాధించింది. అంతే కాదు.. ఈ సారి వరల్డ్ కప్ లో ఎన్నో రికార్డులు. మన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :16 November 2023,1:00 pm

ప్రధానాంశాలు:

  •  రాణించిన మిచెల్

  •  రెచ్చిపోయిన షమీ

  •  సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ

ICC World Cup 2023 Final Match : టీమిండియా ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 లోనూ టీమిండియా దూసుకుపోతుంది. అజేయంగా ముందుకుసాగుతోంది. లీగ్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ లోనూ ఓడలేదు. చివరకు ఫైనల్ కు చేరుకున్న తొలి జట్టుగా రికార్డు సాధించింది. అంతే కాదు.. ఈ సారి వరల్డ్ కప్ లో ఎన్నో రికార్డులు. మన టీమిండియా ఆటగాళ్లు చాలా రికార్డులను క్రియేట్ చేశారు. సొంత గడ్డపై ఆమాత్రం ఉండకపోతే ఎలా? సొంత గడ్డపై టీమిండియా రెచ్చిపోతోంది. నిన్న జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు మూడు సార్లు టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్ లో అడుగు పెట్టింది. ఈ వరల్డ్ కప్ తో కలిసి నాలుగు సార్లు ఫైనల్ లో అడుగు పెట్టింది.

టీమిండియా ఫైనల్ లోకి అడుగుపెట్టడంతో ఇక.. ఫైనల్ మ్యాచ్ ఏ టీమ్ తో జరిగినా కూడా భారత్ ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ఉంది. అసలు భారత్ తో మ్యాచ్ ఆడాలంటేనే మిగితా టీమ్స్ టెన్షన్ పడుతున్నాయి. ఈరోజు జరగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచినా.. ఆస్ట్రేలియా గెలిచినా.. ఏ టీమ్ గెలిచినా.. ఆ టీమ్ ను ఓడించడం టీమిండియాకు పెద్ద పని కాదు. ఎందుకంటే.. లీగ్ దశలో సౌత్ ఆఫ్రికాతో ఆడిన టీమిండియా 243 పరుగుల తేడాతో గెలిచింది. సౌత్ ఆఫ్రికా దారుణంగా భారత్ చేతిలో ఓడిపోయింది. ఇక.. ఆస్ట్రేలియా కూడా చాలా మ్యాచ్ లలో లీగ్ దశలో ఓడిపోయింది. ఈలెక్కన చూస్తే ఫామ్ లో ఉంది భారత్ మాత్రమే. అంటే ఫైనల్ లోనూ భారత్ విజయకేతనం ఎగురవేయబోతోందని ముందే తెలిసిపోయింది.

ICC World Cup 2023 Final Match : సెమీ ఫైనల్ లో ఇరగదీసిన విరాట్ కోహ్లీ

సెమీ ఫైనల్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ మాత్రం ఇరగదీశాడు. సెంచరీ చేసి సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. మరోవైపు న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ కూడా అద్భుతంగా రాణించాడు. 134 పరుగులు చేశాడు. నిజానికి భారత్ 398 పరుగుల భారీ లక్ష్యాన్నే న్యూజిలాండ్ ముందు ఉంచింది. అయినా కూడా మిచెన్ రెచ్చిపోయి ఆడాడు. మనోడి దూకుడు చూసి టీమిండియా ఎక్కడ ఓడిపోతుందో అని అనుకున్నారు. మిచెల్ అవుట్ అయ్యాక కానీ.. టీమిండియా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోలేదు. ఇక.. టీమిండియా బౌలర్లలో షమీ రెచ్చిపోయాడు. ఏడు వికెట్లు తీసి శెభాష్ అనిపించుకున్నాడు. భారత్ విజయయాత్రలో భాగం అయ్యాడు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది