Champions Trophy : బంగ్లాపై గెలిచిన రెండో స్థానంలో భారత్.. సెమీస్ చేరాలంటే..!
ప్రధానాంశాలు:
Champions Trophy : బంగ్లాపై గెలిచిన రెండో స్థానంలో భారత్.. సెమీస్ చేరాలంటే..!
Champions Trophy : రోహిత్ rohit sharma నేతృత్వంలో టీ20 వరల్డ్ కప్ world cup గెలిచిన భారత జట్టు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీని Champions Trophy కూడా దక్కించుకోవాలని చూస్తుంది. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాలని భారత్ ఆరాటపడుతోంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూపు-ఏలో ఉన్న భారత్ పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. 0.408 నెట్ రన్‌ను సాధించింది.

Champions Trophy : బంగ్లాపై గెలిచిన రెండో స్థానంలో భారత్.. సెమీస్ చేరాలంటే..!
Champions Trophy టఫ్ ఫైట్స్..
ఇక పాకిస్తాన్ పై విజయం సాధించిన న్యూజిలాండ్ ఖాతాలోనూ రెండు పాయింట్లే ఉన్నప్పటికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత నెట్ రన్‌రేటు కంటే కివీస్ నెట్ రన్‌రేటు (+1.200) అధికంగా ఉండడమే ఇందుకు కారణం. ఇక బంగ్లాదేశ్ మూడో స్థానంలో పాకిస్థాన్ నాలుగో స్థానంలో ఉన్నాయి.
గ్రూపు-ఏలో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. భారత జట్టు ఆదివారం పాకిస్తాన్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో తలపడాల్సి ఉంది. ఆదివారం పాక్‌తో మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ పాక్ చేతిలో భారత్ ఓడిపోతే మాత్రం అప్పుడు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమ్ఇండియా తప్పక గెలవాల్సి ఉంటుంది. అప్పుడు నెట్‌రన్‌రేట్ కీలకం కావొచ్చు.