Ishan Kishan : ఇషాన్ కిషన్ డబుల్ ధ‌మాకా.. చిన్న పిల్లొడ్ని చూసి నేర్చుకోండి.. సీనియ‌ర్స్‌పై ప్యాన్స్‌ సెటైర్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ishan Kishan : ఇషాన్ కిషన్ డబుల్ ధ‌మాకా.. చిన్న పిల్లొడ్ని చూసి నేర్చుకోండి.. సీనియ‌ర్స్‌పై ప్యాన్స్‌ సెటైర్స్‌..!

 Authored By sekhar | The Telugu News | Updated on :10 December 2022,6:30 pm

Ishan Kishan : బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబల్ సెంచరీతో చేలారేగి ఆడటం జరిగింది. మూడు వన్డేల సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు ఓడిపోవడంతో… టీమిండియా పై తీవ్రస్థాయిలో విమర్శలు రావడం జరిగింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లని బంగ్లా బౌలర్లు గత రెండు మ్యాచ్ లలో కుదేలు చేశారు. అటువంటి బౌలర్లను ఈ మ్యాచ్ లో ఇషాన్… చాలా సులువుగా ఎదుర్కొని సిక్సర్లు బౌండరీ లతో.. విశ్వరూపం చూపించాడు.

బంగ్లాతో రెండో వన్డే మ్యాచ్ లో రోహిత్ శర్మకి బలమైన గాయం తగలడంతో.. ఇండియాకి వచ్చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో జట్టులో స్థానం సంపాదించుకున్న ఇషాన్.. మొదటి అవకాశాన్ని చాలా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మ్యాచ్ ప్రారంభంలోనే టీంలో రెండు వికెట్లు కోల్పోగా ఐదో ఓవర్ లో.. విరాట్ కోహ్లీతో కలిసి ఇషాన్ బంగ్లా బౌలర్లపై పునకం వచ్చినట్టు ఆడటంతో… కేవలం 126 బంతుల్లోనే డబల్ సెంచరీ సాధించడం జరిగింది. దీంతో T20 వరల్డ్ కప్ టోర్నీ ఓడిపోవడం ఆ తర్వాత.. చాలా చిన్న టీం బంగ్లాదేశ్ తో కూడా మొదటి రెండు వన్డే మ్యాచులు ఓడిపోవడం..

India Ps Bangladesh 3rd ODI Match Ishan Kishan Double Century

India Ps Bangladesh 3rd ODI Match Ishan Kishan Double Century

వన్డే సిరీస్ బంగ్లా గెలవటంతో సీనియర్లపై తీవ్రస్థాయిలో క్రికెట్ ప్రేమికులు మండిపడుతున్నారు. వయసు మీద పడిన ప్లేయర్ లు టీంలో ఇంకా కొనసాగిస్తే.. టీం పరిస్థితి రోజురోజుకి నానాటికి దిగజారిపోతుంది.. అంటూ సెలక్టార్ లపై విమర్శలు చేస్తున్నారు. అసలు సీనియర్లను టీంలో నుండి తీసేయాలని కూడా మరి కొంతమంది అంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇషాన్.. డబుల్ సెంచరీ సాధించటంతో చిన్నపిల్లడిని చూసి సీనియర్ లు చాలా నేర్చుకోవాలి అని.. బుద్ధి చెబుతున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో ఇషాన్ కి బెర్త్ కన్ఫామ్ అని కూడా అంటున్నారు.

 

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది