India : టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయిన న్యూజిలాండ్
India : టీ 20 సిరీస్ ఇండియాలోని పింక్ సిటీ జైపూర్‌లోని స్వామి మణిసింగ్ స్టేడియం వేదికగా జరుగుతున్నాయి. బుధవారం న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరుగుతోంది. టాస్ విన్ అయిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.తొలి టీ 20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత ఆటగాళ్లు ఆట ఆడుతున్నారు.

ind vs newzealand
India : రోహిత్ శర్మ సారథ్యంలో భారత్..
భారత్‌కు కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు 17 ఓవర్లు పూర్తి కాగా, అందులో న్యూజిలాండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి, 140 పరుగులు చేసింది. భువనేశ్వర్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో రెండు పరుగులు రాగా, ఒక వికెట్ పోయింది. డారిల్ మిచెల్ క్లీన్ బోల్డ్ అయ్యారు. రెండో ఓవర్‌లో దీపక్ చాహర్ వేసిన బౌలింగ్‌లో తొమ్మిది పరుగులు తీసింది న్యూజిలాండ్ జట్టు.
ఇక ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్ టీమ్. అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో ఫస్ట్ బంతికే అప్పటికే హాఫ్ సెంచరీ చేసిన చాప్‌మన్ (63) పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇదే ఓవర్‌లో మరో ఆటగాడు ఔట్ అయ్యాడు. అతడెవరంటే.. అశ్విన్ వేసిన ఐదో బంతికి గ్లెన్ ఫిలిప్స్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.