Shubman Gill : గిల్ జీవితంలో అతని తండ్రి చాలా స్పెషల్.. తొలి కోచ్ కూడా అతనే..!
ప్రధానాంశాలు:
Shubman Gill : గిల్ జీవితంలో అతని తండ్రి చాలా స్పెషల్.. తొలి కోచ్ కూడా అతనే..!
Shubman Gill : భారత్ జట్టులో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ అంటే ఠక్కున గుర్తొచ్చే వారిలో శుభమన్ గిల్ పేరు కూడా తప్పక ఉంటుంది. ఆయన ఛాంపియన్స్ ట్రోఫీలో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు కొన్ని అద్భుతమైన క్యాచ్‌లు కూడా అందుకున్నాడు. అయితే గిల్ ప్రతిభ వెనక ఆయన తండ్రి కృషి కూడా తప్పక ఉంటుంది. శుభ్‌మన్ గిల్ తండ్రి.. తన కుమారుడు ఐసీసీ ట్రోఫీని గెలవడంపై సంతోషం వ్యక్తం చేశారు.
Shubman Gill : గర్వంతో వచ్చే ఆనందం..
ఈ క్రమంలోనే వికెట్ కీపర్ పంత్ తో కలిసి భాంగ్రా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత అర్షదీప్ సింగ్, గిల్, పంత్, గిల్ తండ్రి కలిసి ఫొటోలకు పోజులిచ్చారు.అయితే ఈక్రమంలోనే శుభ్మన్ గిల్ తండ్రికి సంబంధించి అనేక విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గిల్ తండ్రి రైతు కాగా, అతనే ఫస్ట్ కోచ్ అని తెలుస్తుంది.గిల్ తండ్రి ట్రైనింగ్ ఇచ్చే సమయంలో రోజుకి 500 నుండి 700 బాల్స్ వేసేవారట. అలా కొడుకుని ప్రయోజకుడిని చేసినట్టు అర్ధమవుతుంది.
కుమారుడి సక్సెస్ వెనక గిల్ తండ్రి ఎప్పుడు ఉంటారు.గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ చేపట్టిన సమయంలో తమ కుమారుడు కెప్టెన్‌గా తొలి విజయాన్ని సాధించడంతో శుభ్‌మన్ గిల్ తండ్రి లఖ్వీందర్ సింగ్ ఎమోషనల్ అయ్యారు. తన కమారుడిని గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టి తన సంతోషాన్ని వ్యక్తం చేశారాయన. అలాగే శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ కూడా తన బ్రదర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు.అప్పుడు ఆ పిక్స్ వైరల్ అయ్యాయి.