Rohit Sharma : కొద్ది రోజులుగా రోహిత్ రిటైర్‌మెంట్‌పై ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..!
ప్రధానాంశాలు:
Rohit Sharma : కొద్ది రోజులుగా రోహిత్ రిటైర్‌మెంట్‌పై ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..!
Rohit Sharma : దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇంట్రెస్టింగ్‌గా జరిగిన ఈ మ్యాచ్‌లో . కివీస్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడోసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఈ తుది పోరులో టీమిండియా సారథి రోహిత్ శర్మ (83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 76 పరుగులు) అద్భుతంగా రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Rohit Sharma : కొద్ది రోజులుగా రోహిత్ రిటైర్‌మెంట్‌పై ప్రచారాలు.. క్లారిటీ ఇచ్చిన హిట్‌మ్యాన్..!
Rohit Sharma రిటైర్‌మెంట్‌పై క్లారిటీ..
అయితే ఈ ఫైనల్ తర్వాత వన్డేలకు రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు జోరుగా ప్రచారాలు సాగాయి. దీనిపై రోహిత్ క్లారిటీ ఇచ్చాడు. రెండు ఐసీసీ ట్రోఫీలను గెలవడమనేది ఓ జట్టుకు పెద్ద విజయం. చాలా తక్కువ జట్లు ఇలా విజయం సాధించడం నేను చూశాను. దుబాయ్ వచ్చిన తర్వాత బాగా సన్నద్ధమై, మా ముందున్న సవాల్ ను ఎదుర్కొని టైటిల్ ను సాధించాం అని రోహిత్ అన్నాడు.
భవిష్యత్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు కూడా రోహిత్ సమాధానమిచ్చాడు. భవిష్యత్తు గురించి తనకు ఎలాంటి ప్రణాళికలు లేవని తెలిపాడు..”నాకు భవిష్యత్ గురించి ఎలాంటి ప్రణాళికలు లేవు. జరగాల్సింది అదే జరుగుతుంది. నేనైతే ఈ ఫార్మాట్ రిటైర్మెంట్ ప్రకటించట్లేదు. నా రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారాలు చేయోద్దు అని రోహిత్ స్పష్టం చేశాడు.