IPL 2025 : 32 మ్యాచ్‌లు ముగిసాయి.. మంచి కిక్ ఇచ్చినవి ఇవే..!
ప్రధానాంశాలు:
IPL 2025 : 32 మ్యాచ్‌లు ముగిసాయి.. మంచి కిక్ ఇచ్చినవి ఇవే..!
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు 32 మ్యాచులు జరగగా, ఇందులో కొన్ని రసవత్తరంగా సాగగా.. మరికొన్ని అంతకుమించి థ్రిల్లింగ్ ను అభిమానులు పంచాయి. ఓ నాలుగు మాత్రం మాంచి కిక్ ఇచ్చాయి. రెండు ఓవర్లలో 23 పరుగులు చేస్తే చాలు.. విజయం దిల్లీదే. అలాంటి సమయంలో వరుసగా మూడు బంతుల్లో మూడు రనౌట్లు అవ్వడంతో దిల్లీ కొంపముంచి ముంబయి ఇండియన్స్ గెలిచింది.

IPL 2025 : 32 మ్యాచ్‌లు ముగిసాయి.. మంచి కిక్ ఇచ్చినవి ఇవే..!
IPL 2025 మాములు కిక్ లేవు..
ఐపీఎల్ 2025లో మొదటగా కిక్కిచ్చిన మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్‌రైడర్స్.ఈ మ్యాచులో 111 పరుగులే స్కోరు చేసి.. మళ్లీ ఆ మ్యాచ్‌ను కాపాడుకోవడం పంజాబ్ కింగ్స్ కు దక్కింది. వాస్తవానికి 112 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఉఫ్ అని ఊదేస్తుందని అంతా అనుకుంటే.. లక్ష్య ఛేదనలో 95 పరుగులకే కోల్‌కతా కుప్పకూలింది. చెన్నై సూపర్ కింగ్స్ -లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచులో విజయం దోబూచులాడుతూ చివరికి చెన్నై గూటికి చేరింది. దాదాపు ఓడిపోయే మ్యాచులో ధోనీ.. మెరుపు ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించుకున్నాడు.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ సూపర్ ఓవర్ రుచి చూపించింది దిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్. ఓడిపోతుందనుకున్న మ్యాచులో దిల్లీ క్యాపిటల్స్ పుంజుకున్న తీరు సూపరో సూపర్. పేసర్ మిచెల్ స్టార్క్ తన ప్రదర్శనతో మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తిప్పాడు. సూపర్ ఓవర్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి.. జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచుల్లో ఈ నాలుగు మ్యాచులు మాత్రం మస్త్ మజా అందించాయి.