IPL 2025 Winner RCB : 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ
ప్రధానాంశాలు:
IPL 2025 Winner RCB : 18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ
IPL 2025 Winner RCB : ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో గెలిచి 6 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు Royal Challengers Bengaluru పంజాబ్ పై గెలిచింది. ఐపీఎల్-2025 ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్ బెంగళూరు నిలిచింది. ఎట్టకేలకు కోహ్లీ కల నెరవేరింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడించి, తొలి ట్రోఫీని ముద్దాడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్‌ను గెలుచుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (PBKS)పై RCB 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో PBKS 184 పరుగులు మాత్రమే చేయగలిగింది.