Ashutosh Sharma : ఐపీఎల్ ఆ మజాకా.. ఏడు బంతుల్లో ఓవర్‌నైట్ స్టార్..!
ప్రధానాంశాలు:
Ashutosh Sharma : ఐపీఎల్ ఆ మజాకా.. ఏడు బంతుల్లో ఓవర్‌నైట్ స్టార్..!
Ashutosh Sharma : ఐపీఎల్ 2025 సీజన్ 18వ ఎడిషన్‌లో ఎట్టకేలకు ఓ ఆసక్తికర మ్యాచ్ ప్రేక్షకులకి కనువిందు చేసింది. ఢిల్లీ కేపిటల్స్‌పై గెలిచి తీరుతుందనుకున్న లక్నో సూపర్ జెయింట్స్.. మట్టికరిచింది. గెలుపు అంచుల్లో నిలిచిన ఆ జట్టు పరాజయాన్ని చవి చూడాల్సొచ్చింది.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసిందిఅనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ కేపిటల్స్.. వెంటవెంటనే వికెట్లు కోలోయింది. ఈ క్రమంలో ఢిల్లీ ఇన్నింగ్‌లో అసలు హీరో అశుతోష్ శర్మ. 12.3 ఓవర్లల్లో 113 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి, ఓటమి తప్పదనుకున్న దశలో క్రీజ్‌లోకి దిగిన అశుతోష్ వీరవిహారం చేశాడు. గెలవాలంటే- 45 బంతుల్లో 97 పరుగులు అవసరం.

Ashutosh Sharma : ఐపీఎల్ ఆ మజాకా.. ఏడు బంతుల్లో ఓవర్‌నైట్ స్టార్..!
Ashutosh Sharma సూపర్ గేమ్.
. కాగా, రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు కొట్టాడు. ఆ తరువాతి ఓవర్‌లోనూ అతని దూకుడు కొనసాగింది. అతని ప్రతాపానికి ప్రిన్స్ యాదవ్ బలి అయ్యాడు. ఆ ఓవర్ చివరి మూడు బంతుల్లో 12 పరుగులు రాబట్టడంతో ఈక్వేషన్లు మొత్తం మారిపోయాయి. చివరి ఓవర్ తొలి రెండు బంతులను మోహిత్ శర్మ ఎదుర్కొన్నాడు. షాబాజ్ అహ్మద్ వేసిన ఓవర్ అది. రెండో బంతికి సింగిల్ తీశాడు. మూడో బంతిని అశుతోష్ శర్మ సిక్సర్‌గా మలిచాడు.
జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతను ఎదుర్కొన్న చివరి ఏడు బంతుల్లో 34 పరుగులు వచ్చాయంటే అతని బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. 6,4,6,2,6,4,6.. పరుగులు రాబట్టుకున్నాడు. . 31 బంతుల్లో 66 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ అనుభవం అక్కరకొచ్చింది.. ఈ స్థాయిలో చెలరేగి ఆడటానికి గల కారణాలను వివరించాడు అశుతోష్. విశాఖపట్నం స్టేడియంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ఆడానని, ఆ అనుభవం ఇప్పుడు అక్కరకొచ్చిందని అన్నాడు. వైజాగ్ పిచ్ ఎలా ఉంటుందనేది తనకు బాగా తెలుసునని, ఇక్కడి స్థితిగతులను సులభంగా అర్థం చేసుకోగలిగానని వ్యాఖ్యానించాడు.