Mayank Agarwal : అరవీర భయంకరమైన ఫామ్‌లో ఆ ఆటగాడు.. పట్టుబట్టి టీమ్‌లోకి టీమ్‌లోకి తీసుకొచ్చే ప్లాన్
Mayank Agarwal : గత కొద్ది రోజులుగా భారత ప్రదర్శన ఏ మాత్రం ఆశాజనకంగా లేదు Mayank Agarwal . టెస్ట్‌లో చెత్త ప్రదర్శన కనబరిచి విమర్శల పాలవుతున్నారు. మరోవైపు గౌతమ్ గంభీర్ gautham Gambhir హెడ్ కోచ్ అయినప్పటి నుండి టీమిండియాకి కాలాం కలిసి రావడం లేదు. అయితే ఇప్పుడు గంభీర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఐపీఎల్ 2025కి ముందు జరిగిన మెగా వేలంలో భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ అమ్ముడుపోలేదు. అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. అటువంటి పరిస్థితితులలో మయాంక్ అగర్వాల్ Mayank agarwal విజయ్ హజారే ట్రోఫీ 2024-25 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు…
Mayank Agarwal మయాంక్ ఇన్ ఫామ్..
టోర్నీలో 7 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ సాధించాడు. ఆదివారం నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ 97.48 స్ట్రైక్ రేట్‌తో 119 బంతుల్లో 116 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు కూడా బాదాడు. అతని ఇన్నింగ్స్‌తో కర్ణాటక 9 వికెట్ల తేడాతో నాగాలాండ్‌ను ఓడించింది. మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ vijay hazare trophy 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 613 పరుగులు చేశాడు. అతను గత ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగింటిలో సెంచరీలు సాధించాడు. వాటిలో హ్యాట్రిక్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఓ సెంచరీలో సెంచరీ కూడా మిస్సయింది. అందులో హాఫ్ సెంచరీ సాధించాడు. మయాంక్ కర్ణాటకకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 613 పరుగులు చేశాడు. అతను 153.25 సగటుతో ఈ పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 114 కంటే ఎక్కువ. ఈ సీజన్‌లో అతను 7 మ్యాచ్‌ల్లో 47, 18, 139, 100, 124, 69, 116* పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంభీర్ అతనిని ఛాంపియన్స్ ట్రోఫీకి తీసుకోవాలని అనుకుంటున్నాడు.మయాంక్ అగర్వాల్ టీమిండియా తరపున తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పుడు అతనిని సెలక్ట్ చేసి టీమిండియాకి మంచి విజయాలు అందించాలని గంభీర్ Gambhir భావిస్తున్నట్టుగా సమాచారం. దీనిపై పూర్తి క్లారిటీ రావలసి ఉంది.