Mumbai indians team : రెండుగా చీలిన ముంబై ఇండియన్స్…సంచలన నిజాలు బయటపెట్టిన నేషనల్ మీడియా… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mumbai indians team : రెండుగా చీలిన ముంబై ఇండియన్స్…సంచలన నిజాలు బయటపెట్టిన నేషనల్ మీడియా…

 Authored By ramu | The Telugu News | Updated on :29 March 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Mumbai indians team : రెండుగా చీలిన ముంబై ఇండియన్స్...సంచలన నిజాలు బయటపెట్టిన నేషనల్ మీడియా...

  •  Mumbai indians team : 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా విజయకేతనం ఎగరేసిన ముంబై ఇండియన్స్ 6వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో 2024 ఐపీఎల్ సీజన్ జట్టులో కీలక మార్పులను చేయడం జరిగింది.

  •  2024 ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా టైటిల్ కొట్టాలని ముంబై ఇండియన్స్ తెగ ఆరాటపడుతుంది. దానికోసం 5 సార్లు ముంబై ఇండియన్స్ టీమ్ ను ఛాంపియన్ గా నిలిపిన హిట్ మాన్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

Mumbai indians team : 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్స్ గా విజయకేతనం ఎగరేసిన ముంబై ఇండియన్స్ 6వ సారి కూడా ఐపీఎల్ టైటిల్ ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో 2024 ఐపీఎల్ సీజన్ జట్టులో కీలక మార్పులను చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ మార్పులే జట్టును మూలన పడేసేలా చేశాయి అని చెప్పాలి. ముంబై ఇండియన్స్ టీమ్ యాజమాన్యం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో టీమ్ మొత్తం కాకవికలం అవుతుంది. తాజాగా ముంబై ఇండియన్స్ టీమ్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధం గురించి ఓ నేషనల్ మీడియా సంచలన విషయాలను బయట పెట్టడం జరిగింది. ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలింది అంటూ నేషనల్ మీడియా షాకింగ్ న్యూస్ బయట పెట్టింది. వాస్తవంగా ఒకే జట్టుగా కనిపిస్తున్న ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలిపోయిందా..?మరి దీనిపై క్లారిటీ రావాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే….

2024 ఐపీఎల్ సీజన్ లో ఎలాగైనా టైటిల్ కొట్టాలని ముంబై ఇండియన్స్ తెగ ఆరాటపడుతుంది. దానికోసం 5 సార్లు ముంబై ఇండియన్స్ టీమ్ ను ఛాంపియన్ గా నిలిపిన హిట్ మాన్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. క్యాష్ ఆన్ ట్రేడింగ్ విధానం ద్వారా గుజరాత్ నుండి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ టీమ్ కొనుగోలు చేసింది. అయితే ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఆసక్తికరమైన పరిణామంగా మారిందని చెప్పాలి. ఇక ఎప్పుడైతే రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో అప్పటినుండి ముంబై ఇండియన్స్ టీమ్ లో అంతర్గత యుద్ధం జరుగుతుందని అంటున్నారు. తన కెప్టెన్సీ తో మాయ చేస్తాడు అనుకున్న పాండ్యా వరుసగా ఓటమి పాలవుతూ విమర్శలకు గురవుతున్నారు. అయితే ఇదంతా అందరికీ తెలిసిన విషయమే కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన సంచల విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

ప్రముఖ నేషనల్ మీడియా అయినటువంటి దైనిక్ జాగారన్ ముంబై టీమ్ లో జరుగుతున్న అంతర్గత యుద్ధాల గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. దైనిక్ జాగారం ప్రకారం…ముంబై ఇండియన్స్ టీమ్ రెండుగా చీలిపోయిందని తెలుస్తోంది. ఒకవైపు రోహిత్ శర్మ , జస్ప్రిత్ బూమ్రా , తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ వంటి ప్లేయర్లు ఉండగా మరోవైపు హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు ఉన్నారని తెలుస్తోంది. ఇక హార్దిక్ పాండ్యా కు ముంబై ఇండియన్స్ యాజమాన్యం సపోర్టు ఉన్నట్లుగా తెలియజేయడం జరిగింది. దీంతో అందరూ అనుకుంటున్నట్లుగానే ముంబై ఇండియన్స్ టీమ్ లో అంతర్గత యుద్ధాలు జరుగుతున్నాయని అర్థమవుతుంది. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లో బుమ్రా కు బౌలింగ్ ఇవ్వకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని చెప్పాలి. అంతేకాక ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా సీనియర్లు అయిన మలింగ మరియు పొల్లార్డ్ తో వ్యవహరించిన తీరు అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలోనే ఒక ఆటగాడు ఫామ్ లో లేకపోయినా పర్వాలేదు కానీ ఒక జట్టుగా ఉన్న టీమ్ లో ప్లేయర్ల మధ్య సఖ్యత లేకపోతే అది ఆ జట్టు విజయవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందని పలువురు చెబుతున్నారు. అయితే ముంబై ఇండియన్స్ రెండుగా చీలిపోయింది అనే విషయాన్ని Mufaddal Vohra తన ట్విట్టర్ వేదికగా చాలా క్లారిటీగా తెలియజేశాడు. మరి ముంబై ఇండియన్స్ టీమ్ నిజంగానే చీలిపోయిందా..?దీనిపై మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది