IND VS PAK : పాకిస్థాన్ ఆల్ ఔట్.. భారత్‌కు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన దాయాది
IND VS PAK : పాకిస్థాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అంటే మామూలుగా ఉండదు మరి. భారత్ ఈ మ్యాచ్ ను చాలెంజింగ్ గా తీసుకుంది. అందుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు ఎక్కడికక్కడ కట్టడి చేశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లు కూడా పాకిస్థాన్ ఆడలేకపోయింది. 42.5 ఓవర్లకే పాకిస్థాన్ ఆల్ ఔట్ అయింది. 191 పరుగులు మాత్రమే చేసింది. 192 పరుగుల యావరేజ్ లక్ష్యాన్ని భారత్ ముందుంచింది పాకిస్థాన్. భారత్ కు 25 నుంచి 30 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉంది. అంటే.. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలుపు వశం అయినట్టే అని అనుకోవచ్చు. ఈ మ్యాచ్ కూడా భారత్ గెలిచేస్తే వరల్డ్ కప్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ లోకి వెళ్లిపోతుంది. ఇప్పటికే భారత్ కు నాలుగు పాయింట్లు వచ్చాయి.
ఇక.. పాకిస్థాన్ బ్యాటింగ్ చూసుకుంటే.. కెప్టెన్ బాబర్ అజామ్ మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత రిజ్వాన్ 49 పరుగులు చేశాడు. అబ్దుల్లా 20 పరుగులు, ఇమామ్ 36 పరుగులు, షకీల్ 6, అహ్మద్ 4, షాదాబ్ ఖాన్ 2, నవాజ్ 4, హసన్ అలీ 12, అఫ్రిది 2, హరీస్ 2 పరుగులు చేసి స్కోర్ ను 191 వరకు లాక్కొచ్చారు. ఇక.. భారత బౌలర్లలో చూసుకుంటే ఒక్క శార్దూల్ ఠాకూర్ తప్ప మిగితా వాళ్లంతా తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రా 2, సిరాజ్ 2, హార్దిక్ పాండ్యా 2, కుల్దీప్ యాదవ్ 2, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు.
IND VS PAK : శుభ్‌మన్ గిల్ నే నమ్ముకున్న టీమిండియా
ఐసీసీ వరల్డ్ కప్ లో ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ.. పాకిస్థాన్ మ్యాచ్ లో అడుగుపెట్టాడు. ఇంకాసేపట్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభం కానుంది. ఓపెనర్ గా శుభ్ మన్, కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్ దాదాపుగా భారత్ కు గెలుపు అయినట్టే అనుకోవాలి. పాకిస్థాన్ రన్ రేట్ 4.45 మాత్రమే ఉంది. చాలా తక్కువగా ఉంది. దీంతో పాక్ పాయింట్లు మరింత కిందికి పడిపోనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి వరల్డ్ కప్ లో భారత్ ఓడించే దమ్ము పాక్ కు లేదని భారత్ మరోసారి నిరూపించనుంది.
A first innings story ????
Follow the action ???? https://t.co/OygbV0raRD#CWC23 #INDvPAK pic.twitter.com/OxeTFmszXW
— ICC (@ICC) October 14, 2023
Innings Break!
A cracker of a bowling performance from #TeamIndia! ???? ????
Jasprit Bumrah, Kuldeep Yadav, Ravindra Jadeja, Hardik Pandya & Mohd. Siraj share the spoils with 2️⃣ wickets each!
Scorecard ▶️ https://t.co/H8cOEm3quc#CWC23 | #INDvPAK | #MeninBlue pic.twitter.com/omDQZnAbg7
— BCCI (@BCCI) October 14, 2023
1⃣7⃣7⃣ Intl. Hundreds in One Frame! ????????#CWC23 | #TeamIndia | #INDvPAK | #MeninBlue pic.twitter.com/Pinpabl6jO
— BCCI (@BCCI) October 14, 2023
????????????
Siraj clean bowls Babar Azam ???? https://t.co/pjI99ebcdO#CWC23 #INDvPAK pic.twitter.com/qXnMVvREWb
— ICC (@ICC) October 14, 2023