India VS Australia : ఈసారి ఐసీసీ వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారో కానీ.. ఆ టీమ్ కెప్టెన్ మాత్రం లక్కీ ఫెలో.. ఎందుకంటే?
ప్రధానాంశాలు:
ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న మోదీ స్టేడియం
ఫైనల్ మ్యాచ్ ను వీక్షించనున్న ప్రధాని మోదీ
ప్రధాని మోదీ చేతుల మీదుగా విన్నింగ్ ట్రోఫీ
India VS Australia : ఐసీసీ వన్డ్ వరల్డ్ కప్ 2023 ఫైనల్ సమరానికి తెర లేచింది. నవంబర్ 19న అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ కి భారత్, ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్ అర్హత సాధించాయి. నిజానికి ఈ వరల్డ్ కప్ లో అజేయంగా ముందు సాగుతూ ఫైనల్ కు చేరుకుంది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ లో కూడా భారత్ ఓడలేదు. సొంత గడ్డ మీద దూసుకుపోయింది. సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసిన భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇక.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఆస్ట్రేలియా.. ఫైనల్స్ కు చేరుకుంది. సేమ్.. 2003 లో కూడా ఇలాగే ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్, ఆస్ట్రేలియా రెండు టీమ్స్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. కానీ.. ఆ మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. కానీ.. ఈసారి మాత్రం అలా కాదు. కప్పు కొట్టేవరకు విశ్రమించేది లేదు. ఆస్ట్రేలియాను ఓడించి 20 ఏళ్ల పగను తీర్చుకుంటామని టీమిండియా.. క్రికెట్ ఫ్యాన్స్ కు మాటిచ్చింది.
ఇక.. అహ్మదాబాద్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ కి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. నరేంద్ర మోదీతో పాటు.. కేంద్ర మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్.. ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మ్యాచ్ కు హాజరుకానున్నారు. ఇక.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని కూడా ఈ మ్యాచ్ కోసం భారత్ రానున్నారు. ఆస్ట్రేలియా టీమ్ ఫైనల్స్ కు చేరుకోవడంతో ఆయన కూడా అహ్మదాబాద్ కు వచ్చి ఈ మ్యాచ్ ను వీక్షించనున్నారు. ఈ వరల్డ్ కప్ లో ఎవరు గెలుస్తారో.. ఆ టీమ్ కెప్టెన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ట్రోఫీని అందించనున్నారు. భారత్ గెలిస్తే ఇక అంతకంటే సంతోషం ఉండదు. భారత్ గెలిస్తే.. భారత ప్రధాని చేతుల మీదుగా వరల్డ్ కప్ ట్రోఫీని అందుకోవడం అనేది మామూలుగా ఉండదు. యావత్ భారత జాతి గర్వించే సమయం అది.
India VS Australia : భారత్ గెలవాలని ప్రపంచమే కోరుకుంటోంది
అయితే.. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాలని కేవలం భారత్ మాత్రమే కాదు.. యావత్ ప్రపంచమే కోరుకుంటోంది. సొంత గడ్డ మీద ఇప్పటి వరకు ఓటమి ఎరుగని భారత్ గెలిస్తేనే ఆ ట్రోఫీకి సార్ధకత అని వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ చెబుతున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో. ఎవరు భారత ప్రధాని చేతుల మీదుగా విన్నింగ్ ట్రోఫీని అందుకుంటారో తెలియాలంటే.. ఆదివారం రాత్రి వరకు వెయిట్ చేయాల్సిందే.