
Virat Kohli : ఐసీసీ గణాంకాల గందరగోళం.. విరాట్ కొహ్లీ రికార్డుపై అభిమానుల ఆగ్రహం
Virat Kohli : ఇటీవల ఫామ్ కోల్పోయాడంటూ విమర్శలు ఎదుర్కొన్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ, ఏడాది ముగిసే సరికి తన అసలైన రూపాన్ని చూపించాడు. కీలక మ్యాచ్‌లలో అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడి, వరుస సెంచరీలతో అభిమానులను అలరించాడు. ఈ ప్రదర్శనతోనే ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగేళ్ల తర్వాత కొహ్లీకి ఈ ఘనత లభించగా, అంతలోనే ఐసీసీ చేసిన ఓ పొరపాటు తీవ్ర చర్చకు దారి తీసింది.వన్డే క్రికెట్‌లో నంబర్ వన్ బ్యాటర్‌గా కొహ్లీ గడిపిన రోజులపై ఐసీసీ సోషల్ మీడియాలో విడుదల చేసిన గ్రాఫిక్ తప్పుగా ఉండటమే వివాదానికి కారణమైంది. అందులో కొహ్లీ తన కెరీర్‌లో కేవలం 825 రోజులు మాత్రమే అగ్రస్థానంలో ఉన్నాడని పేర్కొంటూ, ఈ జాబితాలో అతడిని 10వ స్థానంలో ఉంచింది. ఇది చూసిన అభిమానులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు.
Virat Kohli : ఐసీసీ గణాంకాల గందరగోళం.. విరాట్ కొహ్లీ రికార్డుపై అభిమానుల ఆగ్రహం
ఎందుకంటే గతంలో ఐసీసీ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, కొహ్లీ వన్డేల్లో 1,547 రోజులు నంబర్ వన్ ర్యాంక్‌లో కొనసాగాడు. ఇప్పుడు ఆ సంఖ్యను సగానికి తగ్గించి చూపడంపై ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో ఐసీసీపై విమర్శల వర్షం కురిపించడంతో, సంస్థ తప్పును గుర్తించి వెంటనే స్పందించింది.తప్పు గణాంకాలతో ఉన్న పోస్టును తొలగించిన ఐసీసీ, తాజా సవరణలో కొహ్లీ నిజంగా 1,547 రోజులు వన్డే నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగాడని స్పష్టం చేసింది. దీంతో కొహ్లీ ఈ జాబితాలో 10వ స్థానంలో కాకుండా నేరుగా మూడో స్థానానికి ఎగబాకాడు. అతడి కంటే ముందుగా వెస్టిండీస్ దిగ్గజాలు సర్ వివియన్ రిచర్డ్స్ (2,306 రోజులు), బ్రియాన్ లారా (2,079 రోజులు) మాత్రమే ఉన్నారు.
ఇక ప్రస్తుత పరిస్థితి విషయానికి వస్తే, ఒకే ఒక ఫార్మాట్‌లో యాక్టివ్‌గా ఉన్నప్పటికీ కొహ్లీ బ్యాట్ ఇంకా వేడిగానే ఉంది. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్ వరకు వన్డేలు, దేశీయ లిస్ట్ ఎ క్రికెట్‌లో కలిపి ఏడుసార్లు 50కి పైగా స్కోర్లు నమోదు చేశాడు. ఫామ్‌పై వచ్చిన అన్ని సందేహాలకు తన ఆటతోనే సమాధానం చెప్పిన కొహ్లీ, మరోసారి తన స్థాయి ఏంటో నిరూపించుకున్నాడన్న అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. ICC ranking error , Virat Kohli ODI ranking days, Virat Kohli comeback form, Virat Kohli vs New Zealand, ICC social media controversy, Virat Kohli batting form, Virat Kohli century streak, Virat Kohli fan reactions, ఐసీసీ విడుదల చేసిన తప్పు గణాంకాలు , విరాట్ కొహ్లీ నంబర్ వన్ రోజులు, వన్డే క్రికెట్‌లో కొహ్లీ రికార్డు, ఐసీసీ సోషల్ మీడియా వివాదం, కొహ్లీ ఫామ్ తిరిగి వచ్చింది, విరాట్ కొహ్లీ సెంచరీలు, కొహ్లీ ఫ్యాన్స్ ఫైర్, విరాట్ కొహ్లీ న్యూజిలాండ్ మ్యాచ్
SBI : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), వినియోగదారులకు షాక్…
Black Cumin : చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల మన శరీరం వేడి కోసం వేయించిన మరియు అధిక…
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
This website uses cookies.