RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం డౌటేనా.. ఇలా చేస్తే మాత్రం పక్కా వెళుతుంది..!
ప్రధానాంశాలు:
RCB : ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్లడం డౌటేనా.. ఇలా చేస్తే మాత్రం పక్కా వెళుతుంది..!
RCB : టైటిల్ ఫేవరేట్స్‌లో ఒకరిగా బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు చెత్త ప్రదర్శన కనబరుస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్‌లో వరుస పరాజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సరికొత్త రికార్డు నమోదు చేసింది. సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోను ఆర్సీబీ విజయం సాధించింది. అయితే టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ చరిత్ర సృష్టించింది. హైస్కోరింగ్ గేమ్‌లో ఆర్‌సీబీ 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ చేయగా, ఆర్సీబీ మాత్రం నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్(35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83), ఫాఫ్ డుప్లెసిస్(28 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62)హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.
RCB : ప్లేఆఫ్ ఆశలు ఆవిరైనట్టేనా..
అయితే ఆర్సీబీ ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు మ్యాచ్‌లు ఓడి పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పుడు వారిదగ్గర కేవలం రెండే పాయింట్స్ ఉన్నాయి. పంజాబ్‌పై గెలవడంతో ఆ పాయింట్స్ వచ్చాయి. రన్ రేట్ -1.185గా నిలిచింది. అయితే ఆర్సీబీ ఇంకా ఏడు గేమ్‌లు ఆడాల్సి ఉంటుంది. మరి ఈ ఏడు మ్యాచ్‌లతో ప్లేఆఫ్స్‌కి చేరుకుంటుందా అంటే గణాంకాలని పరిశీలిస్తే చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఎలా ఉంటే ఇంకా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, ప్రతి మ్యాచ్‌లోను గెలిచి తీరాలి. దీంతో మైనస్ రన్ రేట్‌ను ప్లస్ కు వస్తుంది. గెలిచే మ్యాచ్‌లు కూడా భారీ మెజార్టీతో గెలిస్తే బాగుంటుంది. మరోవైపు మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలు కూడా ఆర్సీబీ ప్లేఆఫ్స్ పై ప్రభావం చూపనున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీ ప్లేఆఫ్ కల అంత ఈజీ అయితే కాదు. ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. మరి ఆ కల కలగానే మిగిలిపోతుందా, లేక దానిని నిజం చేసి చూపిస్తారా అనేది చూడాలి. నిన్న సన్‌రైజర్స్‌తో ఆడినట్టు కనుక ఆడితే ఆర్సీబీకి వరుస విజయాలు పెద్ద సమస్యేమి కాదు. మ్యాక్స్‌వెల్ తప్ప అందరు కూడా ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నారు. మిగతా మ్యాచ్‌లలో గట్టి బ్యాటింగ్ చేస్తే ఆర్సీబీ అన్నింట్లో గెలవడం చాలా సులభం అవుతుంది. కాగా, చేజింగ్‌లో ఇప్పటి వరకు 246/5 అత్యధిక స్కోర్‌గా ఉండగా.. దానిని ఆర్‌సీబీ బ్రేక్ చేసింది.