Categories: ExclusiveNewssports

Rishabh Pant : రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ మెరుపులు చూసి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఛాన్స్ ప‌క్కా ఇచ్చేస్తారేమో!

Advertisement
Advertisement

Rishabh Pant : యాక్సిడెంట్ వ‌ల‌న కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్‌తో క‌మ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులో ఓ మాదిరిగా ఆడుతున్నాడు కాని చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న అయితే క‌న‌బ‌ర‌చ‌డం లేదు. మ‌రి కొద్ది రోజుల‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌స్తుండ‌గా, ఆ లోపు పంత్ త‌న విశ్వ‌రూపం చూపించాల‌ని అభిమానులు అంతా కోరుకున్నారు. అయితే గుజ‌రాత్ టైటాన్స్ మ్యాచ్‌లో పంత్ జూలు విదిల్చి క్రికెట్ ప్రేమికుల‌కి ప‌సందైన వినోదం పంచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రిషభ్ పంత్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేయ‌డంతో ఆ జ‌ట్టు 224 ప‌రుగుల భారీ స్కోరు చేసింది.

Advertisement

Rishabh Pant : ప‌రుగుల సునామి..

ఢిల్లీ పవర్ ప్లేలో 3 వికెట్లకు 44 పరుగులే చేసింది. ఆ స‌మ‌యంలో రిషభ్ పంత్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో సెట్ అయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు పంత్, అక్ష‌ర్ ప‌టేల్అ. క్షర్ పటేల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే రిషభ్ పంత్ 34 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నూర్ అహ్మద్ విడ‌దీయంతో నాలుగో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్ ప‌రుగుల వ‌ర‌ద పారించారు.

Advertisement

Rishabh Pant : రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ మెరుపులు చూసి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఛాన్స్ ప‌క్కా ఇచ్చేస్తారేమో!

సాయి కిషోర్ వేసిన 19వ ఓవర్‌లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో రిషభ్ పంత్ వరుసగా 2, 6, 4, 6, 6, 6‌ బాది 31 పరుగులు రాబ‌ట్టాడు. అయితే పంత్ రీఎంట్రీలో ఈ రేంజ్ ఆట ఆడ‌లేదు. చాలా రోజుల త‌ర్వాత పంత్ నుండి ఇలాంటి విధ్వంస‌ర ఇన్నింగ్స్ రావ‌డంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక పంత్‌కి వ‌ర‌ల్డ్ క‌ప్ బెర్త్ ప‌క్కా అని కొంద‌రు కామెంట్స్ కూడా చేస్తున్నారు. చూడాలి మిగ‌తా మ్యాచ్‌ల‌లో కూడా ఈ రేంజ్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇస్తే అత‌నిని సెలక్ట్ చేయ‌డం ప‌క్కాగా క‌నిపిస్తుంది.

Advertisement

Recent Posts

Hair Tips : చిట్లిన జుట్టుకు ఈ హెయిర్ ప్యాక్ తో చెక్ పెట్టండి…??

Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…

25 mins ago

Bigg Boss Telugu 8 : ఎక్క‌డా త‌గ్గేదే లే అంటున్న గౌత‌మ్.. విశ్వక్ సేన్ సంద‌డి మాములుగా లేదు..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజ‌న్ 8 చివ‌రి ద‌శ‌కు రానే వ‌చ్చింది. మూడు వారాల‌లో…

1 hour ago

Winter : చలికాలంలో గీజర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు…??

Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…

2 hours ago

Ind Vs Aus : సేమ్ సీన్ రిపీట్‌.. బ్యాట‌ర్లు చేత్తులెత్తేయ‌డంతో 150 ప‌రుగుల‌కే భార‌త్ ఆలౌట్

Ind Vs Aus : సొంత గ‌డ్డ‌పై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భార‌త జ‌ట్టుని వైట్ వాష్ చేసింది.…

3 hours ago

Allu Arjun : ప్లానింగ్ అంతా అల్లు అర్జున్ దేనా.. మొన్న పాట్నా.. రేపు చెన్నై తర్వాత కొచ్చి..!

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule  ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…

3 hours ago

Wheat Flour : మీరు వాడుతున్న గోధుమపిండి మంచిదా.. కాదా.. అని తెలుసుకోవాలంటే… ఈ చిట్కాలను ట్రై చేయండి…??

Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…

4 hours ago

IPL 2025 Schedule : క్రికెట్ అభిమానుల‌కి పండగే పండ‌గ‌.. మూడు ఐపీఎల్‌ సీజన్ల తేదీలు వచ్చేశాయ్‌..!

IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికుల‌కి మంచి మ‌జా అందించే గేమ్ ఐపీఎల్‌. ధ‌నాధ‌న్ ఆట‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి…

5 hours ago

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం.. మీరు దరఖస్తు చేసుకోండి..!

PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…

6 hours ago

This website uses cookies.