Rishabh Pant : రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ మెరుపులు చూసి వరల్డ్ కప్‌లో ఛాన్స్ పక్కా ఇచ్చేస్తారేమో!
ప్రధానాంశాలు:
Rishabh Pant : రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్.. ఆ మెరుపులు చూసి వరల్డ్ కప్‌లో ఛాన్స్ పక్కా ఇచ్చేస్తారేమో!
Rishabh Pant : యాక్సిడెంట్ వలన కొన్నాళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న పంత్ ఐపీఎల్‌తో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఇందులో ఓ మాదిరిగా ఆడుతున్నాడు కాని చెప్పుకోదగ్గ ప్రదర్శన అయితే కనబరచడం లేదు. మరి కొద్ది రోజులలో వరల్డ్ కప్ వస్తుండగా, ఆ లోపు పంత్ తన విశ్వరూపం చూపించాలని అభిమానులు అంతా కోరుకున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో పంత్ జూలు విదిల్చి క్రికెట్ ప్రేమికులకి పసందైన వినోదం పంచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది. రిషభ్ పంత్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 88 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో ఆ జట్టు 224 పరుగుల భారీ స్కోరు చేసింది.
Rishabh Pant : పరుగుల సునామి..
ఢిల్లీ పవర్ ప్లేలో 3 వికెట్లకు 44 పరుగులే చేసింది. ఆ సమయంలో రిషభ్ పంత్, అక్షర్ పటేల్ ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో సెట్ అయిన తర్వాత గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు పంత్, అక్షర్ పటేల్అ. క్షర్ పటేల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ కొద్దిసేపటికే రిషభ్ పంత్ 34 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. ఇక క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని నూర్ అహ్మద్ విడదీయంతో నాలుగో వికెట్‌కు నమోదైన 113 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, రిషభ్ పంత్ పరుగుల వరద పారించారు.
సాయి కిషోర్ వేసిన 19వ ఓవర్‌లో స్టబ్స్ వరుసగా 4, 6, 4, 6 బాది 22 పరుగులు పిండుకున్నాడు. మోహిత్ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌లో రిషభ్ పంత్ వరుసగా 2, 6, 4, 6, 6, 6 బాది 31 పరుగులు రాబట్టాడు. అయితే పంత్ రీఎంట్రీలో ఈ రేంజ్ ఆట ఆడలేదు. చాలా రోజుల తర్వాత పంత్ నుండి ఇలాంటి విధ్వంసర ఇన్నింగ్స్ రావడంతో అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక పంత్‌కి వరల్డ్ కప్ బెర్త్ పక్కా అని కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. చూడాలి మిగతా మ్యాచ్‌లలో కూడా ఈ రేంజ్ పర్‌ఫార్మెన్స్ ఇస్తే అతనిని సెలక్ట్ చేయడం పక్కాగా కనిపిస్తుంది.