Rishabh Pant : రోడ్డు ప్రమాదానికి గురైన భారత్ క్రికెటర్ రిషబ్ పంత్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 30 December 2022, 10:00 am

Rishabh Pant : భారత్ క్రికెటర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రూర్కి దగ్గర.. పంత్ కార్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడం జరిగింది. దీంతో రిషబ్ పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి రిషబ్ నీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రమాదం జరిగినా అనంతరం కారులో మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది.

మంటలు చెలరేగిన సమయంలో కారులో రిషబ్ పంత్ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రుర్కి నుండి ఢిల్లీకి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పంత్ కాలు మరియు నుదుటి, వీటిపై తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించటంతో ఢిల్లీకి తరలించారు. దీంతో రిశాబ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సిరీస్

Rishabh Pant injured in car accident

Rishabh Pant injured in car accident

లో పంత్ ఆడిన విషయం తెలిసిందే. జనవరిలో జరగబోయే శ్రీలంక సీరిస్ కి పంత్ నీ సెలక్షన్ టీం ఎంపిక చేయలేదు. అంతకుముందు మాజీ కెప్టెన్ ధోనితో కలసి దుబాయ్లో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురికావడం సంచలనంగా మారింది. సరిగ్గా వన్డే ప్రపంచ కప్ కి ముందు ఈ రీతిగా కీలక క్రికెటర్ కి ప్రమాదం గురికావడంతో భారత ఆటగాళ్లు కలవర పడుతున్నారు.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp