
Rohit Sharma : రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చినట్టేనా.. ప్రత్యర్ధులకి చుక్కలే..!
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన విజయం సాధించింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విజయంలో రోహిత్ శర్మ (45 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సులు), 226 స్ట్రైక్ రేటుతో సూర్య కుమార్ యాదవ్ (30 బంతుల్లో 68; 6 ఫోర్లు, 5 సిక్సులు) ఊచకోత కోయడంతో సునాయాసంగా విజయం సాధించింది.
Rohit Sharma : రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చినట్టేనా.. ప్రత్యర్ధులకి చుక్కలే..!
గత కొద్ది రోజులుగా ఫామ్ లేమితో బాధపడుతున్న రోహిత్ శర్మ ఇప్పుడు ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. ఇదే ఫామ్ మిగతా మ్యాచ్‌లలో కూడా కొనసాగిస్తే ప్రత్యర్ధులకి చుక్కలు కనపడడం ఖాయం. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (53*), శివమ్ దూబే (50) అర్ధ శతకాలతో రాణించారు. ఆయుష్ మాత్రే (32), షేక్ రషీద్ (19), ఓవర్టన్ (4*) పరుగులు చేశారు. కెప్టెన్ ధోనీ (4), రచిన్ రవీంద్ర (5) నిరాశపరిచారు.
గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో బరిలోకి దిగిన 17 ఏళ్ల ఆయూష్ మాత్రే.. తన అరంగేట్ర మ్యాచులోనే భారీ షాట్లతో అలరించాడు. రెండు సిక్సులు, నాలుగు ఫోర్లు బాది 32 పరుగుల చేశాడు. ఈ క్రమంలోనే చాహర్ బౌలింగ్‌లో శాంట్నర్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.