Rohit Sharma : విసిగిపోయిన రోహిత్.. ముంబైని వీడి ఆ జ‌ట్టులోకి.. రోహిత్‌తో పాటు ఆ ఆట‌గాళ్లు కూడా..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rohit Sharma : విసిగిపోయిన రోహిత్.. ముంబైని వీడి ఆ జ‌ట్టులోకి.. రోహిత్‌తో పాటు ఆ ఆట‌గాళ్లు కూడా..!

Rohit Sharma : ఐపీఎల్ సీజ‌న్ 17లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కొత్త కెప్టెన్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగుతుంది. గుజ‌రాత్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై కెప్టెన్ చేయ‌డంతో రోహిత్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌ని కెప్టెన్సీ నుండి త‌ప్పించి హార్ధిక్‌ని కెప్టెన్ చేయ‌డ‌మేంట‌నే నిర‌స‌న‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిరస‌న‌ల మ‌ధ్యే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల‌లోను దారుణ‌మైన […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Rohit Sharma : విసిగిపోయిన రోహిత్.. ముంబైని వీడి ఆ జ‌ట్టులోకి.. రోహిత్‌తో పాటు ఆ ఆట‌గాళ్లు కూడా..!

Rohit Sharma : ఐపీఎల్ సీజ‌న్ 17లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కొత్త కెప్టెన్ నాయ‌క‌త్వంలో బ‌రిలోకి దిగుతుంది. గుజ‌రాత్ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై కెప్టెన్ చేయ‌డంతో రోహిత్ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన రోహిత్‌ని కెప్టెన్సీ నుండి త‌ప్పించి హార్ధిక్‌ని కెప్టెన్ చేయ‌డ‌మేంట‌నే నిర‌స‌న‌లు కూడా వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ నిరస‌న‌ల మ‌ధ్యే ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు మూడు మ్యాచ్‌లు ఆడింది. మూడు మ్యాచ్‌ల‌లోను దారుణ‌మైన ప‌రాజ‌యాలు చ‌వి చూసింది. గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల చేతుల్లో ముంబై దారుణంగా ఓడిపోయింది.

Rohit Sharma  రోహిత్ శ‌ర్మ‌నే కాదు ఆయ‌న‌తో పాటు సీనియర్ ప్లేయర్లు  కూడా

మూడు ప‌రాజయాల ప‌ట్ల రోహిత్ శ‌ర్మ ఒకింత అస‌హ‌నంతో ఉన్న‌ట్టు స‌మాచారం. ఇన్నాళ్లు ఆ జ‌ట్టు కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డ రోహిత్ శ‌ర్మ ఇప్పుడు ఆ జ‌ట్టుతో ఆడ‌లేక చాలా ఇబ్బందులు ప‌డుతున్నాడ‌ట‌. ఈ సీజ‌న్ త‌ర్వాత రోహిత్ ముంబైని విడిచిపెడతాడని న్యూస్ 24 ఓ క‌థ‌నంలో రాసుకొచ్చింది. ఒక్క రోహిత్ శ‌ర్మ‌నే కాదు ఆయ‌న‌తో పాటు సీనియర్ ప్లేయర్లు జస్ ప్రీత్ బుమ్రా, మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్య కుమార్ యాదమ్ ముంబైను వీడే యోచనలో ఉన్నారని న్యూస్ 24 తెలిపింది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది. ఇదే క‌నుక నిజ‌మైతే ముంబై భారీ మూల్యం చెల్లించుకున్న‌ట్టే అని అంటున్నారు. ఇక రోహిత్ నాయకత్వంలో ముంబైని ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా మార్చాడు. హార్ధిక్ మాత్రం త‌మ జ‌ట్టుని ప్లే ఆఫ్స్‌కి కూడా చేర‌కుండా చూస్తున్న‌ట్టుగా అర్ధ‌మ‌వుతుంది.

రోహిత్‌కు క్రికెట్, కెప్టెన్సీలో మంచి అనుభవం ఉంది.అయితే హార్ధిక్‌కి ఆ అనుభవం కొర‌వ‌డింది. దీంతో ముంబై యాజ‌మాన్యం కూడా ఓ సంచ‌ల‌న నిర్ణయం తీసుకోనుందంటూ కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. న్యూస్ 24 కథనం ప్రకారం, రోహిత్‌ను మళ్లీ కెప్టెన్‌గా చేయడానికి ముంబై యాజ‌మాన్యం ప్ర‌య‌త్నిస్తుంద‌ని టాక్. అయితే అంతక‌ముందు కెప్టెన్ హార్దిక్ తన ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి 2 మ్యాచ్‌ల అవకాశం ఇవ్వవచ్చు. ఈ రెండు మ్యాచుల్లో ముంబైను గెలిపించడంతో పాటు ప్లేయర్ గానూ వ్యక్తిగతంగా రాణిస్తే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. లేదంటే మాత్రం ముంబై కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ని రోహిత్‌కి లేదంటే వేరే సీనియర్ ఆట‌గాళ్ల‌కి ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. చూడాలి మ‌రి రానున్న రోజుల‌లో ఏం జ‌రుగుతుంద‌నేది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది