Rohit Sharma : టీ20 వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మ ఔట్.. కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు?
ప్రధానాంశాలు:
టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ స్థానంలో ఎవరికి చాన్స్?
హార్దిక్ పాండ్యానా లేక సూర్య కుమార్ యాదవ్ కా?
రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా టీ20 సిరీస్ లో ఎలా రాణిస్తుందో?
Rohit Sharma : వచ్చే సంవత్సరం క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే.. వచ్చే సంవత్సరం టీ20 వరల్డ్ కప్ జరగబోతోంది. దీంతో ఈ టోర్నీకి టీమిండియా తరుపున ఆడబోయే ప్లేయర్లను ఇప్పటి నుంచే సెలెక్ట్ చేస్తోంది బీసీసీఐ. అయితే.. టీ20 వరల్డ్ కప్ కు ఎవరు సెలెక్ట్ అవుతారు అనేదానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉన్నారు. అందరూ బాగానే ఆడుతున్నారు. ఇటీవల భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన టీ20 సిరీస్ ను కూడా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. భారత్.. దక్షిణాఫ్రికాతో మరో టీ20 సిరీస్ ను కూడా ఆడనుంది. ఇదంతా పక్కన పెడితే.. 2024 లో జరగబోయే 20 వరల్డ్ కప్ లో ఎవరు ఉండాలి.. ఎవరు ఉండకూడదు అనే దానిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ.. కెప్టెన్ గా రోహిత్ శర్మ ఉంటాడా.. ఉండడా అనేదే పెద్ద డౌట్. ఎందుకంటే.. ఈసారి ఆయన టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు రెడీగా లేనట్టుగా తెలుస్తోంది.
ఇటీవలే తన ఆరోగ్యానికి సంబంధించి, ఫిట్ నెస్ కు సంబంధించి డాక్టర్ల దగ్గర టెస్ట్ చేయించుకున్నాడు రోహిత్ శర్మ. తనకు ఇదివరకు తగిలిన గాయాలు మళ్లీ తిరగబెట్టిన నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. తనకు ప్రస్తుతం ఉన్న ఫిట్ నెస్ అప్పటి వరకు ఉండకపోవచ్చని.. అందుకే ఈసారి టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని రోహిత్ శర్మ అనుకుంటున్నారట. మరి.. రోహిత్ శర్మ టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటే ఆయన ప్లేస్ లో ఎవరికి చాన్స్ ఇస్తారు అనేది తెలియదు. అయితే.. హార్దిక్ పాండ్యాకు ఈ చాన్స్ రావచ్చు. లేదా.. సూర్య కుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సూర్యకుమార్ వల్లే ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. అయితే… ప్రస్తుతం హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ లో ఉన్నాడు. ఆయన వచ్చే సంవత్సరం జనవరిలో ఆఫ్ఘనిస్థాన్ తో జరగబోయే టీ20 సిరీస్ కి అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉంది.
Rohit Sharma : సూర్యకుమార్ యాదవ్ కే చాన్స్
రోహిత్ శర్మ లేకపోతే ఓపెనర్, కెప్టెన్ గా రెండు బాధ్యతలు నిర్వర్తించాలి. దానికి సూర్య కుమార్ యాదవ్ అయితేనే కరెక్ట్ అని బీసీసీఐ భావిస్తోంది. చూడాలి మరి.. రోహిత్ శర్మ లేకపోతే టీమిండియా టీ20 సిరీస్ లో ఎలా రాణిస్తుందో?