Sara Tendulkar : ఇదేందయ్యా ఇది.. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని సంబురపడాలా.. లేక ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ రెచ్చిపోతున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. అవును.. డీప్ ఫేక్ పేరుతో రష్మిక మందన్నా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఇలా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలు పెడితే వాళ్లకు ఏం వస్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం రష్మిక మందన్నా వీడియో గురించి దేశమే కాదు.. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అయితే.. ఆమె ఒక్క దానికే ఇలా జరిగిందా అంటే అస్సలే కాదు.. తాజాగా సచిల్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ కూతురును కూడా సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
సారా టెండుల్కర్, ప్రముఖ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రేమించుకుంటున్నారని.. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అసలు శుభ్ మన్, సారా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా? అది నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెడితే తాజాగా తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్ తో సారా ఫోటో దిగింది. ఆ ఫోటోను కూడా క్రిమినల్స్ మార్ఫింగ్ చేశారు. తన తమ్ముడితో దిగిన ఫోటోను ఏకంగా శుభ్ మన్ గిల్ తో దిగినట్టుగా అర్జున్ ఫోటోను మార్ఫింగ్ చేశారు. అంతే కాదు.. తాను శుభ్ మన్ గిల్ ను ప్రేమిస్తున్నాను.. అన్నట్టుగా సారా టెండుల్కర్ పోస్ట్ పెట్టినట్టుగా పెట్టి సోషల్ మీడియాలో ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు.
అయితే.. అది ఫేక్ ఫోటో అని నెటిజన్లు వెంటనే గుర్తుపట్టేశారు. ఎందుకంటే.. అప్పటికే ఆ ఫోటోను సారా తన అఫిషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోను తీసుకొని సైబర్ నేరగాళ్లు ఇలా శుభ్ మన్ ఫోటో పెట్టి ఫేక్ ఐడీ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఇట్టే పట్టేశారు. ఏది ఏమైనా.. ఇలా ఫేక్ ఫోటోలను పెట్టి ఓ బ్యాచ్ ఇలా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. ఇలాంటి వాటికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో. ఇలాంటి ఫేక్ ఫోటోల వల్ల ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.