Sara Tendulkar : దారుణం.. బరి తెగించారు.. సారా టెండుల్కర్‌నూ వదల్లేదు.. తమ్ముడితో ఫోటో దిగినా వదలరా?
Sara Tendulkar : ఇదేందయ్యా ఇది.. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని సంబురపడాలా.. లేక ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ రెచ్చిపోతున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. అవును.. డీప్ ఫేక్ పేరుతో రష్మిక మందన్నా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఇలా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలు పెడితే వాళ్లకు ఏం […]
ప్రధానాంశాలు:
తన తమ్ముడితో దిగిన ఫోటోను మార్ఫింగ్ చేసిన ఫేక్ రాయుళ్లు
సారా ఫేక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్
వెంటన పసిగట్టేసిన నెటిజన్లు
Sara Tendulkar : ఇదేందయ్యా ఇది.. టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోందని సంబురపడాలా.. లేక ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని సైబర్ క్రిమినల్స్, హ్యాకర్స్ రెచ్చిపోతున్నారని బాధపడాలో అర్థం కావడం లేదు. అవును.. డీప్ ఫేక్ పేరుతో రష్మిక మందన్నా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అసలు ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? ఇలా సోషల్ మీడియాలో ఇలాంటి ఫేక్ ఫోటోలు, వీడియోలు పెడితే వాళ్లకు ఏం వస్తుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం రష్మిక మందన్నా వీడియో గురించి దేశమే కాదు.. ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. అయితే.. ఆమె ఒక్క దానికే ఇలా జరిగిందా అంటే అస్సలే కాదు.. తాజాగా సచిల్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్ కూతురును కూడా సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేశారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తున్నారు.
సారా టెండుల్కర్, ప్రముఖ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ప్రేమించుకుంటున్నారని.. ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అసలు శుభ్ మన్, సారా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారా? అది నిజమా.. అబద్ధమా అనేది పక్కన పెడితే తాజాగా తన తమ్ముడు అర్జున్ టెండుల్కర్ తో సారా ఫోటో దిగింది. ఆ ఫోటోను కూడా క్రిమినల్స్ మార్ఫింగ్ చేశారు. తన తమ్ముడితో దిగిన ఫోటోను ఏకంగా శుభ్ మన్ గిల్ తో దిగినట్టుగా అర్జున్ ఫోటోను మార్ఫింగ్ చేశారు. అంతే కాదు.. తాను శుభ్ మన్ గిల్ ను ప్రేమిస్తున్నాను.. అన్నట్టుగా సారా టెండుల్కర్ పోస్ట్ పెట్టినట్టుగా పెట్టి సోషల్ మీడియాలో ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు.
Sara Tendulkar : అది ఫేక్ ఫోటో అని పసిగట్టిన నెటిజన్లు
అయితే.. అది ఫేక్ ఫోటో అని నెటిజన్లు వెంటనే గుర్తుపట్టేశారు. ఎందుకంటే.. అప్పటికే ఆ ఫోటోను సారా తన అఫిషియల్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోను తీసుకొని సైబర్ నేరగాళ్లు ఇలా శుభ్ మన్ ఫోటో పెట్టి ఫేక్ ఐడీ నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఇట్టే పట్టేశారు. ఏది ఏమైనా.. ఇలా ఫేక్ ఫోటోలను పెట్టి ఓ బ్యాచ్ ఇలా సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతోంది. ఇలాంటి వాటికి ఎప్పుడు పుల్ స్టాప్ పడుతుందో. ఇలాంటి ఫేక్ ఫోటోల వల్ల ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
1263
ANALYSIS: FakeFACT: A digitally altered image of Sara Tendulkar with cricketer Shubman Gill has been shared, claiming she is dating the cricketer. Upon research, we found the original image that features Sara Tendulkar with her brother Arjun Tendulkar, (1/2) pic.twitter.com/Mg5qXK0CAA
— D-Intent Data (@dintentdata) October 27, 2023