World Cup 2023 : ఆదిలోనే భారత్‌కు షాక్.. వరల్డ్ కప్ నుంచి శుభ్‌మన్ గిల్ ఔట్.. అతడి ప్లేస్‌లో వచ్చే ప్లేయర్ ఎవరు?
World Cup 2023 : ఐసీసీ వన్డే ప్రపంచ కప్ స్టార్ట్ అయి ఒక్క రోజు కూడా కాలేదు. అప్పుడే భారత్ కు ఆది లోనే షాక్ తగిలింది. భారత్ తొలి మ్యాచ్ ఇంకా స్టార్ట్ కాకముందే టీమిండియాకు చెందిన కీ ప్లేయర్ శుభ్ మన్ గిల్ వరల్డ్ కప్ కు దూరం అయ్యాడు. నిజానికి శుభమన్ గిల్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు. అతడి మీద టీమిండియా చాలా ఆశలు పెట్టుకుంది. కానీ.. శుభ్ మన్ కి డెంగ్యూ రావడంతో ఆయన ఈ మ్యాచ్ ఆడటం కష్టమే. తొలి మ్యాచ్ నుంచి గిల్ ను టీమిండియా దూరం పెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అతడికి డెంగ్యూ కన్ఫమ్ కావడంతో ఏం చేయాలో టీమిండియాకు తెలియడం లేదు. గిల్ స్థానంలో ఎవరిని తీసుకురావాలి అనే దానిపై టీమిండియా కసరత్తు చేస్తోంది. భారత్ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచ కప్ కు మంచి ఓపెనింగ్ ఇవ్వాలని భారత్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది.
ఈనేపథ్యంలో డాషింగ్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ బారిన పడటంతో టీమిండియా ఒక్కసారిగా షాక్ కు గురయింది. ఆసీస్ తో మ్యాచ్ కు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈలోపు గిల్ కొలుకునే అవకాశం లేదు. అందుకే అతడి స్థానంలో ఓపెనర్ గా ఇషాన్ కిషన్ ను తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఓపెనరే. అందుకే.. ఇషన్, రోహిత్ ఇద్దరూ ఓపెనర్లుగా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే టీమిండియా తొలి మ్యాచ్ కోసం చెన్నైకి చేరుకుంది. చెన్నైకి చేరుకున్నప్పటి నుంచి గిల్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయనకు రక్త పరీక్షలు చేయగా డెంగ్యూగా తెలిసింది.
World Cup 2023 : డెంగ్యూ నుంచి కోలుకోవడానికి కనీసం పది రోజుల సమయం
డెంగ్యూ నుంచి కోలుకోవాలంటే కనీసం పది రోజుల సమయం పడుతుంది. డెంగ్యూ ట్రీట్ మెంట్ స్టార్ట్ అయినా కూడా రెండు రోజుల్లో గిల్ కోలుకునే అవకాశం లేదు. అందుకే.. ఆసీస్ మ్యాచ్ నుంచి గిల్ ను బీసీసీఐ తప్పించాలని చూస్తోంది. ఈసారి వరల్డ్ కప్ లో టైటిల్ ఫేవరేట్ గా టీమిండియా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అందులోనూ భారత్ ఈసారి వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తుండటంతో ఈసారి ఎలాగైనా సొంత గడ్డపై వరల్డ్ కప్ కొట్టాలని భారత్ కసి మీద ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?