Shubman Gill : శుభ్‌మన్ గిల్ ఔట్.. పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ ఆడటం లేదు.. గిల్ ప్లేస్‌లో వచ్చే ప్లేయర్ ఎవరంటే?
Shubman Gill : ప్రస్తుతం ప్రపంచమంతా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ గురించే చర్చిస్తోంది. అందులోనూ ఈసారి క్రికెట్ టోర్నమెంట్ భారత్ లో జరుగుతోంది. దీంతో అందరి దృష్టి భారత్ పై పడింది. మరోవైపు టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు డెంగ్యూ సోకింది. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ కు దూరమయ్యారు గిల్. ఆ తర్వాత ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ కి దూరమయ్యాడు. కానీ.. ఈ మధ్యనే గిల్ డెంగ్యూ నుంచి కోలుకున్నాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో కనీసం పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో అయినా శుభ్ మన్ గిల్ ఆడుతాడు అని అంతా అనుకున్నారు. కానీ.. పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ లోనూ శుభ్‌మన్ గిల్ ఆడే చాన్స్ లేనట్టు తెలుస్తోంది. ఒక్క శుభ్ మన్ గిల్ మాత్రమే కాదు.. మహమ్మద్ సిరాజ్ కూడా ఈ సారి మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. సిరాజ్ ప్లేస్ లో మహమ్మద్ షమీ ఆడే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే.. శార్దూల్ ఠాకూర్ ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడబోతున్నట్టు తెలుస్తోంది.
ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను భారత్ చిత్తుగా ఓడించింది. 6 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. ఆ తర్వాత 8 వికెట్ల తేడాతో రెండో మ్యాచ్ లో అఫ్ఘనిస్థాన్ పై భారత్ గెలిచింది. ఇక.. అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. సెమీ ఫైనల్ లోకి భారత్ చేరాలంటే పాకిస్థాన్ తో మ్యాచ్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. మరోవైపు శుభ్ మన్ గిల్ అహ్మదాబాద్ కు చేరుకున్నాడు. డెంగ్యూ నుంచి రికవరీ కూడా అయ్యాడు. కానీ మ్యాచ్ ఆడేందుకు ఫిట్ గా ఉండాలి కాబట్టి ఇంకొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
Shubman Gill : శుభ్‌మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్
ఇక.. శుభ్ మన్ గిల్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్థాన్ తో మ్యాచ్ లో ఆర్ ఆశ్విన్ ను పక్కన పెట్టిన టీమిండియా శార్దుల్ ఠాకూర్ ను తీసుకుంది. పాకిస్థాన్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రెయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లేదా శార్దుల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, కుల్ దీప్ యాదవ్, జస్ ప్రిత్ బుమ్రా, షమీ ఆడే చాన్స్ ఉంది.