Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ లైఫ్‌ను గౌతమ్ గంభీరే నాశనం చేశాడా..?
Suryakumar Yadav : సూర్యకుమార్ యాదవ్ .. ఈపేరు ప్రస్తుతం టీమిండియా ప్రత్యర్థి జట్లకు నిద్రలేకుండా చేస్తుంది. ఎందుకంటే త్వరలోనే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగనుంది.దీనికి వరల్డ్ బెస్ట్ టీమ్స్, ప్లేయర్స్ మధ్య తీవ్రమైన పోటీ ఉంటుంది.నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫలితాలు తేలుతుంటాయి.2007లో టీ20 వరల్డ్ కప్ కొట్టిన టీమిండియా..చాలా కాలంగా కప్ కోసం ప్రయత్నిస్తూ నిరాశతో ఇంటికి వస్తోంది. ఈసారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ కొట్టాలని భారత్ కసిమీద ఉంది.
Suryakumar Yadav : గంభీర్ ఎందుకు ఇలా చేశాడు..
ప్రస్తుతం టీమిండియాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కొన్నేళ్ల కిందటే టీమిండియాలో స్థానం సంపాదించుకోవాల్సి ఉంది. కానీ టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ వల్లే ఏకంగా ఆరేళ్ల తర్వాత జాతీయ జట్టులోకి ఆలస్యంగా ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చిందట. ఎందుకంటే సూర్య ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టు తరఫున ఆడేవాడు. అప్పడు దానికి కెప్టెన్ గౌతమ్ గంభీర్.. ఇతని సారథ్యంలో కేకేఆర్ రెండు సార్లు కప్పు గెలిచింది. అయితే, కేకేఆర్‌లో సూర్యకు చాలా తక్కువ సార్లు బ్యాట్ పట్టుకునే అవకాశం కల్పించేవాడట గంభీర్.. ఒకటి రెండు సార్లు సూర్యకు తన ప్రతాపం చూపించే అవకాశం వచ్చిన బంతులు ఎక్కువగా లేకపోయేవని టాక్.
గంభీర్ సూర్యను ఎంకరేజ్ చేయకోవడం వల్లే ఇన్నాళ్లు టీమిండియా డ్యాషింగ్ బ్యాట్స్ మెన్‌ను కోల్పోయింది. ఇక సూర్య ఎప్పుడైతే ముంబై జట్టులోకి వచ్చాడో రోహిత్ శర్మ అతన్ని బాగా ఎంకరేజ్ చేశాడట.. ప్రతిసారి 4వ స్థానంలో పంపుతూ పరుగులు రాబట్టేవాడట.. అలా సూర్య శక్తి తెలిసాక బీసీసీఐ అతన్ని జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ కావడంతో అతనికి జాతీయ జట్టులో కూడా 4 స్థానం కల్పించాడట. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరిగిన మాస్టర్ కార్డ్ టీ20 కప్‌లో సూర్య విధ్వంసాన్ని సృష్టించి జట్టుకు కప్ అందించాడు. కాగా, సూర్యకుమార్ యాదవ్ ఆరేళ్ల క్రికెట్ సర్వీస్ పోవడానికి గంభీర్ కారణమని వార్తలు వస్తున్నాయి.