Suryakumar Yadav : వన్డేల్లో పరుగులు చేయలేకపోతున్న సూర్య కుమార్ యాదవ్.. ఊహించని నిర్ణయం తీసుకున్న మిస్టర్ 360
Suryakumar Yadav : ఇండియా జట్టులోకి మెరుపు తీగలా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లోఈ ఆటగాడు తన ప్రతాపాన్ని చూపించాడు. అతను కొట్టిన షాట్లకు అభిమానులే కాక అంతర్జాతీయ క్రికెట్ మాజీలు కూడా నోరెళ్లపెట్టారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ టీ20 బ్యాటర్ అయిన సూర్య.. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా తనదైన రీతిలో మెరుపులు మెరిపించాడు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ హాట టాపిక్‌గా మారుతున్నాడు.
టీ 20లలో అదరగొడుతున్య సూర్య వన్డేలలో తేలిపోతున్నాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో సూర్యకి ఛాన్స్ దక్కగా దాన్ని వినియొగించుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ సూర్య ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లోకి కూడా అడుగుపెట్టి తన సత్తా చూపించాలని భావిస్తున్న సూర్య ప్రస్తుతం బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ కు దూరంగా ఉన్నాడు సూర్య. ఈ సమయాన్ని సద్వినియోగా చేసుకోవాలని పక్కా ప్లాన్ వేసిన అతను ఈ ఏడాది రంజీ సీజన్ లో రాణించి టీమిండియా టెస్ట్ క్రికెట్ జట్టులో స్థానం దక్కించుకోవాలని ఆశపడుతున్నాడు. మహారాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ సెక్రటరీ అజింక్యా నాయక్ మాట్లాడుతూ..!
Suryakumar Yadav : టెస్ట్ క్రికెట్‌పై కన్ను..!
గత కొన్ని రోజులుగా సూర్య కుమార్ వైట్ బాల్ క్రికెట్ తో బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఆంధ్రాతో జరిగే తొలి మ్యాచ్ కు సూర్య దూరం కానుండగా, డిసెంబర్ 20న హైదరాబాద్ తో జరిగే రెండో మ్యాచ్ కు సూర్య అందుబాటులో ఉంటాడు అని చెప్పుకొచ్చారు. సూర్య కుమార్ రాకతో ముంబై జట్టు మరింత బలపడుతుందని అజింక్యా నాయక్ అన్నారు. అయితే డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ పర్యటన మొదలు కాగా, ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఇప్పటికే వన్డే ఫార్మాట్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన సూర్యకుమార్ యాదవ్‌కు ఆ పర్యటనలో స్థానం ఇవ్వని నేపథ్యంలో సూర్య అభిమానులు మండిపడుతున్నారు.