Team India : ఆ వేస్ట్ ప్లేయర్ ఎందుకు టీమిండియాపై మండిపడుతున్న ఫ్యాన్స్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India : ఆ వేస్ట్ ప్లేయర్ ఎందుకు టీమిండియాపై మండిపడుతున్న ఫ్యాన్స్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :10 November 2022,6:20 pm

Team India : T20 వరల్డ్ కప్ టోర్నీలో లీగ్ దశలో అద్భుతంగా గేమ్ ఆడిన టీమిండియా సెమీఫైనల్ లో చేతులెత్తేసింది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో చిత్తుచిత్తుగా ఓడింది. ఒక వికెట్ నష్టపోకుండా ఇంగ్లాండ్ లక్ష్యాన్ని చేదించింది. ఇండియన్ బౌలర్స్ ని … ఇంగ్లాండ్ ఓపెనర్స్ బట్లర్, హెల్స్ చితక బాదేశారు. మొదటి ఓవర్ నుండి దూకుడుగా ఆడుతూ… 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్ లోనే చేదించారు. దీంతో ఇంగ్లాండ్ ఫైనల్ కి చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ టోర్నీలో మొదటి నుండి టీమిండియా ఓపెనర్స్ సరిగ్గా రానిచటం లేదు.

ముఖ్యంగా కేఎల్ రాహుల్ ఆట తీరు ఎంతో నిరాశ కలిగిస్తూ ఉంది. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 5 పరుగులు చేసి రెండో ఓవర్ లో అవుట్ అయిపోయాడు. కొద్ది నెలల క్రితం కేఎల్ రాహుల్ ఆట తీరుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో పొగిడారు. అయితే ఇటీవల జరిగిన మ్యాచ్ లలో కేఎల్ రాహుల్ పెద్దగా… ఆడిన సందర్భాలు కూడా లేవు. ఈ టి 20 ప్రపంచ కప్ టోర్నీలో ఆడిన ఆరు మ్యాచ్ లో 128 పరుగులు చేయడం జరిగింది. ఇందులో రెండు అర్థ శతకాలు ఉన్నాయి. అదికూడా పసికోనా లాంటి టీమ్స్ బంగ్లాదేశ్ మరియు జింబాబ్వేలపై ఆడాడు.

team india fans full series about kl rahul playing style

team india fans full series about kl rahul playing style

అయితే కీలకమైన ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 5 పరుగులకే అవుట్ అవ్వటం పట్ల ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలైన మ్యాచ్లో ఆడని వాడి ఎందుకు టీం లో పెట్టుకుంటున్నారు. కేఎల్ రాహుల్ వేస్ట్ ఆటగాడు లాగా మారిపోతున్నాడు. అనవసరంగా అతనికి అవకాశం ఇచ్చి టీం… ఓడిపోయేలా మేనేజ్మెంట్ వ్యవహరిస్తుంది అంటూ… ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత.. క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రాహుల్ ఆట తీరువల్ల మరో ఓపెనర్ రోహిత్ ఆట కూడా పాడైపోతుందని… రాహుల్ నీ పక్కన పెట్టేయండి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది