team india shoyab aktar tips to pakisthan players
Team India : దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్‌లో ఎన్నడూ పాకిస్థాన్ భారత్‌పై నెగ్గలేదు. ఈ క్రమంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో కూడా భారత్ గెలుపు ఖాయమని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయమై ఇండియన్స్ ఆసక్తికరంగా చర్చించుకోవడంతో పాటు మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. కాగా, టీమిండియాను ఓడించేందుకుగాను పాకిస్థాన్ క్రికెటర్స్‌కు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్లర్ టిప్స్ ఇచ్చాడు.
team india shoyab aktar tips to pakisthan players
చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో భారత్‌దే విజయమని భారతీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్ గెలుపును నిలువరించడం అసాధ్యమని అంటున్నారు కూడా. ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదుసార్లు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా ఐదింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది. టీ20లో మాత్రమే కాదు, వన్డేల్లోనూ పాకిస్థాన్ భారత్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్స్ అందరి ఫేవరెట్ టీమ్ కూడా టీమిండియానే అన్న ప్రచారం సాగుతోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే భారత జట్టును ఓడించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండంటూ మూడు కామెడీ టిప్స్ షేర్ చేశాడు షోయబ్ అక్తర్. అవేంటంటే. ఇండియన్ క్రికెటర్స్‌కు స్టీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది ఫస్ట్ టిప్.
కాగా, రెండోది విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ వాడకుండా టూ డేస్ ఆపడం.. ఇక థర్డ్ టిప్ ఏంటంటే.. టీమిండియా మెంటార్ గా ఉన్న ధోనీని బ్యాటింగ్‌కి రావొద్దని కోరడం. ఇలా ఆసక్తికర టిప్స్ ఇచ్చాడు షోయబ్ అక్తర్. ఆయన ఇచ్చిన టిప్స్‌ను బట్టి టీమిండియా ఈ సారి కూడా గెలిచేస్తుందని చెప్పకనే చెప్పాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోని మెంటార్‌గా ఉండి.. ప్లేయర్స్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫ్రీ గానే ఈ మెంటార్ బాధ్యతలను ధోని స్వీకరించాడు.
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
This website uses cookies.