Team India : టీమిండియాను ఓడించేందుకు షోయబ్ అక్తర్ టిప్స్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Team India : టీమిండియాను ఓడించేందుకు షోయబ్ అక్తర్ టిప్స్..

 Authored By mallesh | The Telugu News | Updated on :24 October 2021,10:00 pm

Team India : దాయాదులు అయిన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు టీ 20 వరల్డ్ కప్‌లో ఎన్నడూ పాకిస్థాన్ భారత్‌పై నెగ్గలేదు. ఈ క్రమంలోనే ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో కూడా భారత్ గెలుపు ఖాయమని భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. ఈ విషయమై ఇండియన్స్ ఆసక్తికరంగా చర్చించుకోవడంతో పాటు మ్యాచ్ కోసం వేచి చూస్తున్నారు. కాగా, టీమిండియాను ఓడించేందుకుగాను పాకిస్థాన్ క్రికెటర్స్‌కు ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్లర్ టిప్స్ ఇచ్చాడు.

team india shoyab aktar tips to pakisthan players

team india shoyab aktar tips to pakisthan players

చిరకాల ప్రత్యర్థులు అయినటువంటి భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ దుబాయ్ వేదికగా ఆదివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో భారత్‌దే విజయమని భారతీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్‌ గెలుపును నిలువరించడం అసాధ్యమని అంటున్నారు కూడా. ఇప్పటి వరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఐదుసార్లు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా ఐదింటిలోనూ భారత జట్టు విజయం సాధించింది. టీ20లో మాత్రమే కాదు, వన్డేల్లోనూ పాకిస్థాన్ భారత్‌ను ఒక్కసారి కూడా ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్స్ అందరి ఫేవరెట్ టీమ్ కూడా టీమిండియానే అన్న ప్రచారం సాగుతోంది. ఈ సంగతులు ఇలా ఉంచితే భారత జట్టును ఓడించాలంటే ఈ టిప్స్ ఫాలో అవండంటూ మూడు కామెడీ టిప్స్ షేర్ చేశాడు షోయబ్ అక్తర్. అవేంటంటే. ఇండియన్ క్రికెటర్స్‌కు స్టీపింగ్ ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది ఫస్ట్ టిప్.

Team India : గెలుపు భారత్‌దే.. !

కాగా, రెండోది విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ వాడకుండా టూ డేస్ ఆపడం.. ఇక థర్డ్ టిప్ ఏంటంటే.. టీమిండియా మెంటార్ గా ఉన్న ధోనీని బ్యాటింగ్‌కి రావొద్దని కోరడం. ఇలా ఆసక్తికర టిప్స్ ఇచ్చాడు షోయబ్ అక్తర్. ఆయన ఇచ్చిన టిప్స్‌ను బట్టి టీమిండియా ఈ సారి కూడా గెలిచేస్తుందని చెప్పకనే చెప్పాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. టీ 20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ధోని మెంటార్‌గా ఉండి.. ప్లేయర్స్‌కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫ్రీ గానే ఈ మెంటార్ బాధ్యతలను ధోని స్వీకరించాడు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది