India vs Pakistan : T20 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ మ్యాచ్ ఇండియా vs పాకిస్తాన్ .. జరగాలంటే టోర్నీలో ఇవి జరగాల్సిందే..!!
India vs Pakistan: ఈ ఏడాది T20 వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ టోర్నీలో వరణుడు కీలకంగా మారడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో వర్షాలు ఎక్కువ పడుతూ ఉండటంతో… ఒక్కసారిగా మ్యాచ్ ల ఫలితాలు తారు మారవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే గ్రూప్ వన్ నుంచి న్యూజిలాండ్ చేరుకోగా… శనివారం ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో విన్ అయ్యే జట్టు సెమీస్ కి చేరుకోనుంది. ఆదివారం నవంబర్ ఆరవ తారీకు గ్రూప్ 2 నుండి సెమీస్ కి వెళ్లే టీం తేలనుంది. దీంతో నవంబర్ ఆరవ తారీకు సూపర్ 12 పోటీలకు తెరపడనుంది. రెండు గ్రూపులలో టాప్ 2 లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్ కి చేరుకోనన్నాయి.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ మరియు ఇండియా టీంల మధ్య జరిగే మ్యాచ్ ఆ రెండు దేశాలు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూస్తారు. రెండు దాయాది దేశాలు తలపడే ఈ మ్యాచ్ అంటే ఐసీసీ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈ టోర్నీలో ఇప్పటికే ఈ రెండు చెట్లు పోటీ పడగా… ఉత్కంఠ పోరులో ఇండియా గెలవడం జరిగింది. ఈ రెండు జట్లు ఇప్పుడు సెమిస్ చేరుకోవడానికి.. మ్యాచ్ లు ఆడటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ టోర్నీలో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడితే బాగుంటుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఆశిస్తున్నారు.
అయితే ఇండియా… పాకిస్తాన్ టీములు ఫైనల్ మ్యాచ్ ఆడాలంటే… టోర్నీలో ఇవి జరగాల్సిందే. పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే బంగ్లాదేశ్ జరిగే పై మంచి రన్ రేట్ తో గెలవాలి. దాంతోపాటు నెదర్లాండ్స్ చేతిలో సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. లేదా వర్షంతో ఆ మ్యాచ్ రద్దు అవ్వాలి. అప్పుడు సౌత్ ఆఫ్రికా ఇంటికి… పాకిస్తాన్ సెమీస్ కి వెళతాయి. మరోవైపు జింబాబ్వే పై ఇండియా గెలవాలి. సెమీస్ లో గ్రూప్ 2 నుండి భారత్.. పాక్ గ్రూప్ వన్ సెమీస్ జట్లతో ఆడతాయి. అక్కడ కూడా రెండు టీములు గెలిస్తే… అప్పుడు భారత్… పాక్ ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంటుంది.