T20 World Cup : వచ్చే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియాలో చాలా మార్పులు.. రోహిత్, కోహ్లీ ఔట్..!
T20 World Cup : టీమిండియా క్రికెట్ జట్టులో చాలా మార్పులు జరుగుతున్నాయి. ఒకప్పుడు సీనియర్ ప్లేయర్స్ కూడా చాలా రోజులు టీంలో ఆడేవారు. కాని ఇప్పుడలా కాదు. మెరుగైన ప్రదర్శన కనబరచకపోతే తీసి పక్కన పడేస్తున్నారు. ఈ నెల 23న భారత్ టీ20 ప్రపంచ కప్‌లో పాక్‌ని ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్‌తో మనోళ్ల హంగామా మొదలు కానుంది. ఈ సారి రోహిత్ సేన వరల్డ్ కప్ సాధిస్తుందా అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే 2024 టీ20 ప్రపంచ కప్‌పై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఈ టోర్నీకి దాదాపు అన్ని దేశాలు తమ జట్లలో మార్పులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సీనియర్ ఆటగాళ్లను తప్పించి యువకులకు చోటిచ్చే అవకాశం ఉందని తెలుస్తుండగా,
భారత జట్టులో కూడా చాలా మంది సీనియర్లు ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంటర్నేషనల్ టీ20లు ఆడకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మందుగాదినేష్ కార్తీక్ గురించి చెప్పుకోవాలి. దాదాపు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడనుకొన్న సమయంలో అద్భుతమైన ప్రదర్శనలతో టీం ఇండియా తలుపు తట్టాడు. ఆయన 2024 వరల్డ్ కప్‌కి అందుబాటులో ఉండడు. ఇక విరాట్ కోహ్లీ తన పనిభారాన్ని తగ్గించుకునేందుకు ఇటీవల కాలంలో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే టీ 20 నుండి తప్పుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ టీ20లు ఆడకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
T20 World Cup : వారు ఆడకపోవచ్చు..
ఇప్పుడు మూడు ఫార్మాట్‌లలో టీం ఇండియాకు సారథ్యం వహిస్తున్న హిట్‌మ్యాన్ ఇటీవలి కాలంలో చాలా గాయాలతో బాధపడ్డాడు . అతని ఫిట్‌నెస్ చాలా సందర్భాలలో నిరాశపరిచింది. కాబట్టి 2024కి అందుబాటులో ఉండడని అంటున్నారు. రోహిత్ తర్వాత టీ20 జట్టు పగ్గాలు అందుకొనే జాబితాలో హార్దిక్ పాండ్యా ముందు ఉన్నాడు. రోహిత్ స్థానంలో ఓపెనింగ్ చేయడానికి యంగ్ ప్లేయర్లకు కూడా కొదవలేదు. ఒకప్పుడు టెస్ట్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్ కూడా దాదాపు ఆడకపోవచ్చు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తరచుగా గాయాలపాలు అవుతూ భారత జట్టుకి దూరం అవుతున్నాడు. అతని ఫిట్‌నెస్ లెవెల్స్ ఏమంత బాలేదు. అందుకే అతను కూడా దూరం అవుతాడు అనే టాక్ ఉంది.