Virat Kohli : చాలా గ్యాప్ తర్వాత కోహ్లీ సెంచరీ.. అతడిని మెచ్చుకుంటున్న ఫ్యాన్స్.. రాహుల్ వల్ల సెంచరీ చేయలేదట
Virat Kohli : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోతోంది. మామలుగా కాదు. వరుసగా నాలుగు మ్యాచ్ లు గెలిచి తమ సత్తా చాటింది టీమిండియా. ప్రస్తుతం వరల్డ్ కప్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. సొంత గడ్డ మీద టీమిండియా దుమ్మురేపుతోంది. భారత్ కు తిరుగులేదు అని సత్తా చాటుతోంది. ఇదంతా పక్కన పెడితే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత క్రికెట్ అభిమానులు తెగ సంబురపడిపోతున్నారు. ఎందుకంటే.. విరాట్ కోహ్లీ చాలా గ్యాప్ తర్వాత వరల్డ్ కప్ లో సెంచరీ చేశాడు. దీంతో కోహ్లీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అంతే కాదు.. కోహ్లీ సెంచరీ చేయడానికి అంపైర్ రిచర్డ్ హెల్ప్ చేశాడని అతడిని తెగ పొగిడేస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ మాత్రం రిచర్డ్ పై జోక్స్ పేల్చుతున్నారు. కేవలం రాహుల్ మాత్రమే కాదు.. కోహ్లీ సెంచరీకి ఒకరకంగా అంపైర్ కూడా కారణమే అంటున్నారు.
కోహ్లీ 97 పరుగులు చేసిన తర్వాత 42వ ఓవర్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. బంగ్లాదేశ్ బౌలర్ నాసుమ్ అహ్మద్ బౌలింగ్ వేస్తూ తొలి బంతినే లెగ్ సైడ్ వేశాడు. దీంతో కోహ్లీ వెంటనే ఆ బంతి బారి నుంచి తప్పుకున్నాడు. దీంతో నేరుగా దాన్ని కీపర్ క్యాచ్ పట్టాడు. కోహ్లీకి ఆ బంతి వేసిన నాసుమ్ మీద చిరాకు వేసింది. నిజానికి దాన్ని వైడ్ గా ప్రకటించాలి. కానీ.. దాన్ని రిచర్డ్ కెటిల్ బరో వైడ్ గా ప్రకటించలేదు. ఆ తర్వాత మూడో బాల్ కే కోహ్లీ సిక్సర్ బాదాడు. దీంతో కోహ్లీ సెంచరీ పూర్తయింది.
Virat Kohli : అసలు గడ్డం ఎందుకు గోక్కున్నట్టు?
మరోవైపు కోహ్లీ సెంచరీని పక్కన పెట్టి.. ఆ బంతిని వైడ్ ఇవ్వకుండా ఏదో ఆలోచిస్తున్నట్టు అంపైర్ గడ్డం గోక్కోవడం ఏంటో.. అసలు ఏం యాక్టివ్ చేస్తున్నావురా.. అసలు నీకు మెడల్ ఇవ్వాలి.. అంటూ కొందరు రిచర్డ్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే.. ఒకవేళ అది వైడ్ అని ప్రకటించి ఉంటే.. కోహ్లీ మరింత ఒత్తిడికి లోనయ్యేవాడు. దాని వల్ల కోహ్లీ సెంచరీ పూర్తి చేసి ఉండేవాడు కాదు. అందుకే.. ఒకరకంగా చూస్తే కోహ్లీ సెంచరీ పూర్తి చేయడానికి అంపైరే సాయం చేశాడు అని.. అతడికి క్రికెట్ అభిమానులు సెల్యూట్ చేస్తున్నారు. ఏది ఏమైనా భారత్ ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉంది. ఓటమి అనేదే లేకుండా ముందుకు వెళ్తోంది. చూద్దాం మరి మున్ముందు ఇంకా ఎలా మ్యాచ్ లు ఆడుతుందో?
Picture Perfect ????????#CWC23 | #TeamIndia | #INDvBAN | #MenInBlue pic.twitter.com/DDWo9uyAfo
— BCCI (@BCCI) October 19, 2023
For his scintillating unbeaten century in the chase, Virat Kohli receives the Player of the Match award ????#TeamIndia continue their winning run in #CWC23 after a 7-wicket win over Bangladesh ????????
Scorecard ▶️ https://t.co/GpxgVtP2fb#INDvBAN | #MenInBlue pic.twitter.com/7AypN7QNhK
— BCCI (@BCCI) October 19, 2023