Virat Kohli : ఆ విషయమై నాతో ఎవరూ మాట్లాడలేదు.. వన్డేలపై విరాట్ కోహ్లీ కీలక వ్యాఖ్యలు..
Virat Kohli : భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రోజుల పాటు సౌత్ ఆఫ్రికాలో జరిగే టెస్టు క్రికెట్‌లో పాల్గొనేందుకుగాను కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా జట్టు బయలుదేరనుంది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వన్డే లో కొనసాగడంపైన విరాట్ స్పష్టతనిచ్చారు.తన కూతురు పట్టిన రోజు కారణంగా విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటారని, రెస్ట్ తీసుకుంటారని గతంలో చాలా వార్తలొచ్చాయి.
కానీ, వీటన్నిటికీ భిన్నంగా విరాట్ కోహ్లీ తాజాగా ముంబైలో మాట్లాడారు. తాను వన్డేలు ఆడేందుకుగాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని విరాట్ కోహ్లీ స్పష్టం చేశారు. తాను ఎంపిక కోసం ఎప్పుడూ అవెయిలబులిటీలోనే ఉంటానని, బీసీసీఐని తానెప్పుడూ రెస్ట్ కోరలేదని తెలిపారు విరాట్. దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే సిరీస్‌కూ తాను అందుబాటులో ఉంటానని, తాను అందుబాటులో ఉండబోనని, వన్డేలకు గుడ్ బై చెప్పేశాననే వార్తలు రాస్తున్న వారంతా నమ్మశక్యులు కాదని చెప్పారు.ఈ నెల 16న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉంది.
Virat Kohli : టెస్ట్ సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఔట్..!
ఈ నెల 26 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.విరాట్ కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు తొలిస్థానానికి చేరుకుంటుంది. ఇకపోతే వన్డే జట్టును మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. తనకు రోహిత్‌కు మధ్య ఎటువంటి గొడవలు లేవని, రెండున్నరేళ్లుగా తాను ఇదే విషయాన్ని పదే పదే చెప్తున్నానని విరాట్ చెప్పారు. తాను ఏది కోరుకున్నా, ఏది చేసినా అది టీమిండియా జట్టుకు ఉపయోగపడాలనే చేస్తున్నానని అన్నారు. రోహిత్‌కు తనకు మధ్య ఎటువంటి సమస్య లేదని స్పష్టం చేశారు విరాట్. 2019 వరల్డ్ కప్ తర్వాత ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య గొడవల స్టార్ట్ అయ్యాయని చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి.