Virat Kohli : నేటి మ్యాచ్‌లోను విరాట్ కోహ్లీ డకౌట్.. వ్యాపారం చేసుకోమంటూ నెటిజన్స్ సూచనలు
Virat Kohli : రన్ మెషీన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు ఇతడు ఆడిన తీరును చూస్తే సచిన్ రికార్డులు గల్లంతవ్వడానికి ఎంతో సమయం పట్టదనిపించేది. మైదానంలోకి అడుగు పెడితే సెంచరీ చేసే వరకు లేదా జట్టును గెలిపించే వరకు అవుటవ్వను అన్న రీతిలో కోహ్లీ బ్యాటింగ్ సాగేది. కోహ్లీని అవుట్ చేయడానికి మా దగ్గర వ్యూహాలు లేవంటూ పలువరు కెప్టెన్లు భావించేవారంటే అతిశయోక్తి కాదు. […]
Virat Kohli : రన్ మెషీన్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన విరాట్ కోహ్లీ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు ఇతడు ఆడిన తీరును చూస్తే సచిన్ రికార్డులు గల్లంతవ్వడానికి ఎంతో సమయం పట్టదనిపించేది. మైదానంలోకి అడుగు పెడితే సెంచరీ చేసే వరకు లేదా జట్టును గెలిపించే వరకు అవుటవ్వను అన్న రీతిలో కోహ్లీ బ్యాటింగ్ సాగేది. కోహ్లీని అవుట్ చేయడానికి మా దగ్గర వ్యూహాలు లేవంటూ పలువరు కెప్టెన్లు భావించేవారంటే అతిశయోక్తి కాదు. ఐపీఎల్‌లో విరాట్ ఫామ్ దారుణంగా సాగుతుంది. గుజరాత్ టైటాన్స్‌తో హాఫ్ సెంచరీ బాదిన విరాట్ లయ అందుకున్నాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో గత మ్యాచ్‌లో 33 పరుగులు చేసిన విరాట్..
తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాత్రం గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు.ఈ సీజన్‌లో విరాట్‌కు ఇది మూడో గోల్డెన్ డక్. ఇందులో రెండు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తోనే కావడం గమనార్హం. స్పిన్ ఆడటంలో తీవ్రంగా తడబడుతున్న విరాట్.. మరోసారి స్పిన్నర్‌కే ఔటయ్యాడు. యువ స్పిన్నర్ జగదీష సుచిత్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ తొలి బంతికే విరాట్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. విరాట్ వైఫల్యం కన్నా అతను ఔటైన తీరే అభిమానులును తీవ్రంగా బాధిస్తోంది. కేన్ వ్యూహానికి తగ్గట్లు ఆడాల్సిన విరాట్.. బాధ్యతారాహిత్యంగా ఆడి సింపుల్‌గా కేన్ విలియమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. విరాట్ ఔటైన తీరు క్యాచింగ్ ప్రాక్టీస్‌గా కనిపించిందంటే అతిశయోక్తి కాదు. విరాట్ దారుణ వైఫల్యం కారణంగా ఆర్‌సీబీ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది.
Virat Kohli : కోహ్లీకి ఏమైంది..!
విరాట్ కోహ్లీ ఔటైన తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు అతనికి అండగా నిలిచిన సొంత అభిమానులు కూడా కోహ్లీ ఇలానే చూడలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్రకటించి సతీమణి అనుష్క శర్మతో కలిసి వ్యాపారం చేసుకోమంటున్నారు. ఇంకొందరు మాత్రం సినిమా హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని సూచిస్తున్నారు. క్రికెట్‌ను మాత్రం వదిలేయాలని కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్ డక్ అయిన విరాట్ కోహ్లీ.. 2014లో కూడా మూడు సార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. ఓ టాపార్డర్ బ్యాటర్ ఇలా రెండు సీజన్లలో గోల్డెన్ డక్ అవ్వడం ఇదే తొలిసారి. అత్యధిక సార్లు గోల్డెన్ డక్ అయిన బ్యాటర్‌గా కోహ్లీ చెత్త రికార్డును నమోదు చేశాడు.