Virat Kohli : విరాట్ కోహ్లీకి గడ్డు కాలం మొదలైందా.. ఇక జట్టులో చోటు కోల్పోవడం కూడా ఖాయమా..!
Virat Kohli : భారత క్రికెట్ జట్టుకి సేవలు అందించిన విరాట్ కోహ్లీ ఇటీవల అన్ని ఫార్మాట్స్ నుండి కెప్టెన్‌గా తప్పుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు బీసీసీఐ కోహ్లికి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో తనతో పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరుపకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారంటూ కోహ్లి వ్యాఖ్యానించడం వివాదానికి తెరతీసింది. ఇక మూడో టెస్ట్ ఓటమి తర్వాత కోహ్లీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా కూడా తప్పుకున్నాడు. అయితే అన్ని ఫార్మాట్స్ నుండి తప్పుకున్నా కూడా కోహ్లీ వన్డే మ్యాచ్‌లలో పెద్దగా ప్రతిభ కనబరచలేదు.
సఫారీలతో వన్డే సిరీస్‌లో అతను రెండు హాఫ్ సెంచరీలతోనే సరిపెట్టాడు. స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోతున్నాడు. ఇన్నింగ్స్‌లో వేగం ఉండట్లేదు. కోహ్లీ బ్యాట్ నుంచి మూడంకెల స్కోరు కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి రావడం అనూహ్యం. కెప్టెన్సీ వివాదంతో విరాట్ కోహ్లీ మానసికంగా మరింత దెబ్బ తిన్నట్లుంది అతడి వాలకం చూస్తుంటే. క్రికెటర్‌గా కోహ్లీ ప్రస్తుతం టఫ్ ఫేజ్‌లో ఉన్నాడు. గడ్డు కాలం మొదలైందని, ఇలానే ఆడితే రానున్న రోజులలో అతనికి జట్టులో చోటు దొరకడం కూడా కష్టమే అని అంటున్నారు. ఇటీవల షోయబ్ అక్తర్ మాట్లాడుతూ అనుష్కతో పెళ్లి వలనే ఆయన కెరీర్ ఇలా మారిందని సంచలన కామెంట్స్ చేశాడు.

virat kohli career in critical situation
Virat Kohli : కోహ్లీకి కష్టాలు మొదలు..
భారత క్రికెట్లో కెప్టెన్సీ గురించి చివరగా పెద్ద చర్చ జరిగిందంటే.. సౌరవ్ గంగూలీపై వేటు పడ్డపుడే. మళ్లీ ఇప్పుడు నాయకత్వ మార్పు పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు టెస్టు కెప్టెన్ ఎవరు అనే అయోమయం అందరిలోనూ నెలకొంది. టెస్టుల్లో రోహిత్ ఇంకా స్థిరత్వం సాధించేలేదు. రాహుల్‌ని అనుకున్నా కూడా అతడు ఆటగాడిగా, కెప్టెన్‌గా దారుణంగా నిరాశపరిచాడు. పంత్‌ని అనుకుంటున్నా కూడా అతను పెద్దగా రాణించకపోవడం బీసీసీఐని ఆందోళనలోకి నెడుతుంది.