Virat Kohli : 17 ఏళ్ల తర్వాత కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్.. కన్నీటి పర్యంతమైన విరాట్..!
ప్రధానాంశాలు:
Virat Kohli : 17 ఏళ్ల తర్వాత కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్.. కన్నీటి పర్యంతమైన విరాట్..!
Virat Kohli : పీఎల్ ఫైనల్స్ IPL Final 2025 లో పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి, ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ RCB . మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక్కసారిగా ఏడ్చేశాడు. ఇది చూసిన విరాట్ ఫ్యాన్స్ చాలా ఎమోషనల్ అయ్యారు. 18 ఏళ్లు.. దాదాపు 18 ఏళ్లు.. గెలిచినా, ఓడినా ఒక జట్టునే సపోర్ట్ చేస్తూ వస్తున్న ఫ్యాన్స్ సైతం భావోద్వేగానికి లోనయ్యారు.

Virat Kohli : 17 ఏళ్ల తర్వాత కోహ్లీ చేతిలో ఐపీఎల్ కప్.. కన్నీటి పర్యంతమైన విరాట్..!
Virat Kohli : ఎమోషనల్..
మంగళవారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది. ఈ విజయంతో విరాట్ కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యాడు. జోష్ హజెల్ వుడ్ ఆఖరి ఓవర్ పూర్తవ్వకముందే.. ఆర్‌సీబీ విజయం లాంఛనమవ్వగా.. కోహ్లీ చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఆర్‌సీబీ విజయం ఖాయం కాగానే.. నేల కూలిన విరాట్.. కన్నీటి పర్యంతమయ్యాడు
విరాట్ కోహ్లీని ఓదార్చేందుకు మిగతా ప్లేయర్లంతా తన దగ్గరకు వచ్చినా.. కోహ్లీ ఎమోషన్స్‌ను ఆపుకోలేకపోయాడు. కోహ్లీ భార్య అనుష్క శర్మ సైతం తన వద్దకు వచ్చి.. భావోద్వేగాన్ని పంచుకుంది. ఏముందిలే.. ఐపీఎల్ కప్పే కదా అని అనుకునే వారికి ఇది అర్థం కాకపోవచ్చు.ఒక వ్యక్తిని, ఒక టీమ్‌ను నమ్మి కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి ఏడాది సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అది కూడా.. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా. మరి అంతమంది నమ్మకాన్ని 18 ఏళ్ల తర్వాత నిలబెట్టుకుంటే.. ఆ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవ్వాలి.
3 minutes of Raw Kohli 🤩
Don’t miss the end one.#RCBvsPBKS #Kohli pic.twitter.com/T6OwHxS4Sa
— CA Akhil Agarwal (@InvestWithAkhil) June 3, 2025