Virat Kohli : కోహ్లీ గుండెకి ఏమైంది.. సంజూ శాంసన్‌తో చెక్ చేయించుకున్న విరాట్
ప్రధానాంశాలు:
Virat kohli : కోహ్లీ గుండెకి ఏమైంది.. సంజూ శాంసన్‌తో చెక్ చేయించుకున్న విరాట్
Virat kohli : టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ప్లేయర్ విరాట్ కోహ్లీ తాజాగా జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. అయితే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ సందర్భంగా విరాట్ కోహ్లీ.. ప్రత్యర్థి వికెట్ కీపర్ అయిన సంజూ శాంసన్‌తో హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.

Virat Kohli : కోహ్లీ గుండెకి ఏమైంది.. సంజూ శాంసన్‌తో చెక్ చేయించుకున్న విరాట్
Virat Kohli గుండెకి ఏమైంది..
ఈ మ్యాచ్‌లో వానిందు హసరంగా వేసిన 15వ ఓవర్ నాలుగో బంతికి విరాట్ కోహ్లీ క్విక్ డబుల్ తీసాడు. వేగంగా పరుగెత్తడంతో ఆయాసానికి గురైన కోహ్లీ.. వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరకు వెళ్లి హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరాడు. వెంటనే శాంసన్.. తన కీపింగ్ గ్లోవ్స్ తీసేసి.. కోహ్లీ చాతిపై చేతిని పెట్టి హార్ట్ బీట్ చెక్ చేయగా, ఆయన బాగానే ఉందని సంజూ శాంసన్ చెప్పడంతో.. కోహ్లీ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు.
ఈ ఘటనతో కోహ్లీ ఫ్యాన్స్ భయాందోళనకు గురవుతున్నారు. కోహ్లీకి ఏమైనా గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తీవ్రమైన ఎండలో బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ డీహైడ్రేషన్‌కు గురయ్యాడని మరికొంతమంది ఫ్యాన్స్ అంటున్నారు. ప్రస్తుతానికి ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
గుండె పట్టుకున్న కోహ్లీ.. అసలేమైంది..?
నిన్న RRతో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఒక్కసారిగా గుండె పట్టుకున్న కింగ్ కోహ్లీ
కోహ్లీ ఛాతిపై చేయి పెట్టి హార్ట్ బీట్ చెక్ చేసిన రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్
ఎప్పుడూ ఫిట్ గా ఉండే కోహ్లీకి ఏమైందోనని ఫ్యాన్స్ ఆందోళన pic.twitter.com/V0UaiV83es
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2025