IND vs SL 1st ODI : శ్రీలంకతో తొలి వన్డేలో విరాట్ కోహ్లీ రికార్డుల మోత… సచిన్, పాంటింగ్ రికార్డ్స్ బ్రేక్..!!
IND vs SL 1st ODI : టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాకముందు ఫామ్ లో లేక విరాట్ కోహ్లీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ ఆ టోర్నమెంటులో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆడిన ఆట తీరు.. తర్వాత ఫుల్ ఫామ్ లోకి రావటం జరిగింది. దీంతో మంచి జోరు మీద ఉన్న కోహ్లీ ఇటీవల జరుగుతున్న టోర్నమెంటులలో గతంలో మాదిరిగానే మళ్ళి వరుస పెట్టి రికార్డులు క్రియేట్ చేయటం స్టార్ట్ చేశాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ… లెక్కల తారుమారు చేస్తున్నాడు.
ఈ క్రమంలో ప్రస్తుతం లంకటూర్ లో ఉన్న కోహ్లీ మంగళవారం జరిగిన మొదటి వన్డే మ్యాచ్ లో ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. మేటర్ లోకి వెళ్తే శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో 12,500 పరుగుల మార్క్ కి కోహ్లీ చేరుకున్నాడు. కేవలం 257 మ్యాచ్ లలో అందుకున్న ఇంటర్నేషనల్ ప్లేయర్ గా కోహ్లీ ఈ ఫీట్ అందుకోవటం జరిగింది. కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ 310, రిక్కి పాంటింగ్ 328 మ్యాచ్ లలో 12,500 పరుగులు చేయడం జరిగింది.
ఈ పరిణామంతో అంతర్జాతీయ వన్డే క్రికెట్ ఫార్మేట్ లో అతి తక్కువ మ్యాచ్ లకి 12,500 పరుగులు అందుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో 87 బంతుల్లో 113 పరుగులు చేయడం జరిగింది. దీంతో తన కెరియర్ లో 45వ సెంచరీ సాధించటం జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్ లలో 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరీ ఈ భారీ స్కోర్ శ్రీలంక టీం అందుకుంటుందో లేదో చూడాలి.