Virender Sehwag :ద్రవిడ్ కి షాక్ ఇవ్వనున్న బిసిసిఐ.. టీ20 ఫార్మాట్ కు కొత్త కోచ్ ఇతనే..!
Virender Sehwag : ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌లో టీమిండియా ఇంగ్లండ్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఇండియా vs ఇంగ్లండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంగ్లండ్ జట్టుపై గెలిచి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుతో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకుంటుందని టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆశిస్తే.. దారుణంగా నిరాశపరిచారు. ఓటమి తర్వాత ఇప్పుడు టీమిండియాలో మార్పులు చేయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్లపైనే కాకుండా కోచ్, యాజమాన్యం పై కూడా సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
దానికీ ఓ కారణం ఉంది.రాహుల్ ద్రవిడ్ టీ20లకు కోచ్ గా ఎందుకు? జట్టు వెంట మెంటర్ గా టెస్టు బ్యాట్స్ మెన్ లక్ష్మణ్ ఎందుకు? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు సగటు క్రీడాభిమానులు. టీ 20లలో దూకుడైన ఆట, బౌలర్లపై ఎదురుదాడికి దిగే మనస్థత్వం ఉంటేనే నెగ్గుకు రాగలం. ప్రపంచంలో అలాంటి మనస్థత్వం గల ఏకైక డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ లాంటి డాషింగ్ బ్యాటర్ కోచ్ అయితే ఇలాంటి మెగా టోర్నీల్లో గెలవగలం అంటున్నారు. . టెస్టులను టీ20లుగా, వన్డేలను టీ10లు ఆడిన ఘనత వీరేంద్రుడి సొంతం. బౌలర్లను ఆదిలోనే ఊచకోత కోస్తే.. తర్వాత కూడా పరుగులు రావడం సులభం అవుతుంది.
Virender Sehwag : సెహ్వాగ్ కరెక్ట్..
వీరేంద్రుడి మైండ్ సెట్‌తో గేమ్ ఆడితేనే నెట్టుకు రాగలం. సెహ్వాగ్ లాంటి మైండ్ సెట్ ఉంటేనే టీ20 ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీల్లో కప్ లు కొట్టగలం అని కొందరు విశ్లేషణలు చేస్తున్నారు. మ్యాచ్‌పై పట్టు సాధించాలంటే పవర్ ప్లేలో మంచి స్కోర్ రాబట్టాలి అంటుంటారు. కానీ రోహిత్ శర్మ విషయంలో అది జరగలేదు. రోహిత్ శర్మ తొలి 28 బంతుల్లో నాలుగు బౌండరీలు కలిపి కేవలం 27 పరుగులు మాత్రమే రాబట్టాడు. అంటే రోహిత్ శర్మ తన ప్లాన్‌ని తానే ఇంప్లిమెంట్ చేయలేకపోయాడా అనే సందేహం కలుగుతోంది. కేఎల్ రాహుల్ మొదటి మూడు మ్యాచుల్లోనూ కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. అర్ధ సెంచరీలు చేసిన కూడా అవి పెద్దగ ఉపయోగపడలేదు.